- Telugu News Photo Gallery Spiritual photos Ram navami 2021 date history and significance of the auspicious day during navratri
SriRama Navami 2021: ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందంటే .. నవమికి చేయాల్సిన పూజలు పాటించాల్సిన పద్దతి..!
SriRama Navami 2021: హిందువులకు ఆరాధ్యదైవం శ్రీరాముడు.. మనదేశములో రాముడి గుడి లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు.. నరుడు నారాయణుఁడుగా కొలవబడుతున్నాడు. శ్రీరామ నవమి వస్తుందంటే చాలు ఊరువాడా సందడే సందడి. సారి శ్రీ రామ నవమి ఎప్పుడు వచ్చింది..?, ఎలా దేవుడిని ఆరాధించాలి..?, ఉపవాసం చేసే పద్ధతులు ఏమిటి..? ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం.
Updated on: Apr 19, 2021 | 6:22 PM

శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చిత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఈరోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈరోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 21, మధ్యాహ్నం 12:43 నిమిషాలకి మొదలయింది. అప్పటి నుంచి ఏప్రిల్ 22, 2021 న రాత్రి 12:35 తో ముగుస్తుంది.

శ్రీరాముడి కళ్యాణం ఏప్రిల్ 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదే మధ్యాహ్నం పూట పూజ చేయాలనుకుంటే ఒంటి గంట నుంచి 1:35 వరకు చేసుకోవచ్చు.

శ్రీరామ నవమి రోజున వేకువజామునే నిద్ర లేచి శుచిగా స్నానమాచరిస్తారు దేవుడు మందిరం శుభ్రం చేసుకున్నాక దీపారాధన చేస్తారు. అలానే శ్రీ రామునికి పండ్లు, తులసి ఆకులని, పూలని, ప్రసాదాన్ని అర్పిస్తారు.

శ్రీరామనవమి రోజున ఒక్క రాముడు పుట్టిన రోజే కాదు.. సీతారాముల కల్యాణం. శ్రీరాముడి పట్టాభిషేకం వంటి కార్యక్రమాలను జరుపుకున్న విశిష్టమైన రోజు.

అంతటి విశిష్టత కలిసిన నవమి రోజున దేశంలో రామాలయం ఉన్న ప్రాంతాల్లోనే కాదు.. ఊరువాడా కూడా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. వడపప్పు, పానకం రాములవారి కల్యాణానికి ప్రసాదం గా పెట్టి అందరికీ నైవేద్యంగా పంచిపెడతారు.

శ్రీ రాముని కళ్యాణం నిర్వహించిన అనంతరం గుడిలోనే రామచరితమానస్, రామాయణం, రామస్తుతి, రామ రక్ష స్తోత్రం వంటివి చదువుతారు




