- Telugu News Photo Gallery Spiritual photos Kedareshwar temple in harishchandragad a story worth exploring
Kedareshwar Temple : ఈ గుడిలో అన్ని అద్భుతాలే.. నాలుగో స్థంభం విరిగిన రోజున కలియుగం చివరి రోజట
మహా శివుడి లీలలు మానవమాత్రుడికి వర్ణింప తరమా.. దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో లింగాకారంలో కొలువుదీరి భక్తుల పూజలను అందుకుంటున్నాడు పరమశివుడు. మనదేశంలో పకృతి లో కొండాకోనల నడుమ వెలసిన అనేక దేవాలయాలు.. ప్రతి దేవాలయం ఏదొక రహస్యాన్ని దాచుకున్నవే.. అలాంటి ఆలయంలో ఒకటి కేధారేశ్వర స్వామీ ఆలయం..
Updated on: Apr 20, 2021 | 3:35 PM

అపురూప మైన .. చూపరులను ఆకట్టుకునే అద్భుతమైన కట్టడం.. అహమద్ నగర్ లో హరిచంద్ర కోట లో ఉన్న కేదారేశ్వర స్వామి ఆలయం.

ఈ మందిరం పై ఉంది ఒక పెద్ద బండరాయి. కింద 4 స్థంబాలు పైన శివయ్య కోసం గుడి నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.

ఈ ఆలయంలో 4 యుగాలికి సంకేతాలు గా 4 స్థంబాలు వున్నాయి. సత్య యుగం,త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగాలకి గుర్తులుగా భావిస్తారు భక్తులు.

ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు ఒక్కో యుగంతనికి ఒక స్థంభం విరిగిపోతుంది. ఇప్పుడు మనం కలియుగం లో వున్నాం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్థంభం పై న మాత్రమే వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్థంభం కూడా పతనం అవుతుందో ఆ రోజు ఈ కలియుగాని కి ఆఖరి రోజు గా స్థానికుల కథనం

అంతటి మహాత్వమైన గోపురం ఉన్న ఈ ఆలయంలో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే...ఈ గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది.. అందుకనే ఈ ఆలయం లోపల చాలా చల్లగా ఉంటుంది. ఇక లోపలికియు ఎవరూ వెళ్లరు. ఒక్క వర్ష కాలం లో మాత్రం గుడిలోపల ఒక్క చుక్క నీరు కూడా ఉండదు.. వేసవి, శీతాకాలం లో 5 అడుగుల ఎత్తున నీరు వుంటుంది ..




