AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్వారు.. ఆతర్వాత మళ్లీ దాని జోలికి వెళ్ళలేదు..

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సుమారు 40 ఏళ్లు అవుతోంది. ఆయన హీరోగా పరిచయమైన సినిమా 1986 మే 23న విడుదలైంది. ఈ 40 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నాగ్ .

Nagarjuna: ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్వారు.. ఆతర్వాత మళ్లీ దాని జోలికి వెళ్ళలేదు..
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: May 26, 2026 | 6:57 AM

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోగా రాణిస్తున్న నాగార్జున ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాగే ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు నాగార్జున. లవర్ బాయ్, యాక్షన్ హీరో, రొమాంటిక్ హీరో, భక్తి చిత్రాల నటుడిగా నటించి మెప్పించారు. హీరోగానే కాదు నిర్మతగాను సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు నాగార్జున. హీరోగానే సినిమాలు చేస్తున్న నాగార్జున ఇప్పుడు విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు నాగార్జున. ధనుష్ నటించిన కుబేర సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో నాగ్ తన నటనతో మరోసారి మెప్పించారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టారు నాగ్.

కూలీ సినిమాలో అందరిని డామినేట్ చేశారు నాగ్.. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాపై నాగ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన స్కూల్ డేస్, హీరోగా ఎదిగిన విధానం, ఎదుర్కున్న సమస్యల గూరించి పంచుకున్నారు. కాగా నాగార్జున మాట్లాడుతూ..

చిన్నతనం నుంచి హీరో అవుతానని ఎప్పుడూ అనుకోలేదని నాగ్ అన్నారు. తమ కుటుంబం చాలా చిన్న వయసులోనే హైదరాబాద్‌కు వచ్చేసిందని, ఇక్కడే చదువు పూర్తిచేశానని తెలిపారు. అయితే స్కూల్ డేస్‌లో స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరావు కుమారుడిననే కారణంతో ఎలాంటి ప్రత్యేక గుర్తింపు స్కూల్‌లో నాకు రాలేదు. అలాగే నేను చదువుల్లో టాప్ కూడా కాదు ఎదో మాములుగా చదువుతాను. అలాగే ఆయన మాట్లాడుతూ.. 5 తరగతిలో చదువుతున్న సమయంలో స్కూల్ డ్రామాలో తనకు ఆడవేషం వేయించారని తెలిపారు. నాగార్జున లేడీ గెటప్ లో ఉన్న నన్ను చూసి అందరూ నన్ను చూసి నవ్వారు. నాకు చాలా సిగ్గేసింది. ఆ రోజు తర్వాత మళ్లీ డ్రామాల జోలికి వెళ్లలేదు” అంటూ సరదగా పంచుకున్నారు నాగార్జున. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us