‘సూపర్‌ డీలెక్స్‌’ మైండ్ బ్లోయింగ్- అనురాగ్ కశ్యప్

చెన్నై: ‘సూపర్‌ డీలెక్స్‌’ సినిమాకు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఇందులో విజయ్‌ సేతుపతి ట్రాన్స్ జండర్ పాత్రలో నటించగా, సమంత హంతకురాలిగా , రమ్యకృష్ణ వేశ్య పాత్రలో నటించారు. త్యాగరాజన్‌ కుమారరాజా ఈ చిత్రానికి దర్శకులు. టూ డేస్ బ్యాక్ ఈ సినిమా ట్రైలర్ చూసిన అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. […]

‘సూపర్‌ డీలెక్స్‌’ మైండ్ బ్లోయింగ్- అనురాగ్ కశ్యప్
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 16, 2019 | 10:19 AM

చెన్నై: ‘సూపర్‌ డీలెక్స్‌’ సినిమాకు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఇందులో విజయ్‌ సేతుపతి ట్రాన్స్ జండర్ పాత్రలో నటించగా, సమంత హంతకురాలిగా , రమ్యకృష్ణ వేశ్య పాత్రలో నటించారు. త్యాగరాజన్‌ కుమారరాజా ఈ చిత్రానికి దర్శకులు. టూ డేస్ బ్యాక్ ఈ సినిమా ట్రైలర్ చూసిన అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. దాన్ని మిస్‌ అయినందుకు ఇప్పుడు చాలా బాధగా ఉందని అన్నారు. చిత్రం ట్రైలర్‌ చాలా బాగుందని మెచ్చుకున్నారు. కాాగా మార్చి 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ చిత్రం స్పెషల్ ప్రివ్యూ చూసిన అనురాగ్‌ మళ్లీ ప్రశంశల వర్షం కురిపించారు. ‘కుమారరాజా తీసిన ‘సూపర్‌ డీలెక్స్‌’ చూశా. మైండ్‌బ్లోయింగ్‌.. సినిమా ఎంతో గొప్పగా ఉంది. ఈ సినిమాలో నేను లేననే బాధ పెరిగిపోతోంది. కుమారరాజా ఎన్నో ట్రిక్స్‌ తెలిసిన, ధైర్యం ఉన్న ఫిల్మ్‌మేకర్‌’ అని అనురాగ్‌ ట్వీట్ చేశారు. నయనతార నటించిన ‘ఇమైక్కా నోడిగల్‌’ సినిమాతో అనురాగ్‌ గత ఏడాది కోలీవుడ్‌కు నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఆయన రుద్ర అనే ప్రతినాయకుడి పాత్రను పోషించి విమర్శకుల మెప్పు పొందారు.