AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసీదులో మ్యూజిక్ వీడియో.. నటి, సింగర్‌లపై కేసు నమోదు

పాకిస్తాన్ నటి సబా ఖమర్‌, సింగర్‌ బిలాల్‌ సయీద్‌లపై లాహోర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మసీదులో మ్యూజిక్‌ వీడియోను తెరకెక్కించినందుకు గానూ పవిత్రతను ఉల్లంఘించారంటూ

మసీదులో మ్యూజిక్ వీడియో.. నటి, సింగర్‌లపై కేసు నమోదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2020 | 5:53 PM

Share

Case against Pakistan Actor: పాకిస్తాన్ నటి సబా ఖమర్‌, సింగర్‌ బిలాల్‌ సయీద్‌లపై లాహోర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మసీదులో మ్యూజిక్‌ వీడియోను తెరకెక్కించి దాని పవిత్రతను దెబ్బతీశారని.. దైవ దూషణ చట్టం కింద ఈ ఇద్దరిపై కేసు నమోదైంది. ఇటీవల ఈ ఇద్దరు లాహోర్‌లోని వజీర్‌ ఖాన్‌ మసీదులో  ఓ వీడియోను చేయగా.. అందులోని ఓ క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వారిపై దైవ దూషణ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. పాకిస్తాన్ మీడియా ప్రకారం.. వారిద్దరితో పాటు ఈ వీడియో తీయడంలో భాగమైన వారిపైన న్యాయవాది సర్దార్ ఫర్హత్‌ మజూర్ ఖాన్ ఆగష్టు 13న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.

కాగా దీనిపై సబా ఖమర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. తాము తెరకెక్కించిన ‘ఖబూల్’‌లో ఒకే ఒక్క సీన్‌ని వాజిర్ ఖాన్ మసీదులో షూట్ చేశామని అన్నారు. ఈ సన్నివేశం వచ్చినప్పుడు మేము మ్యూజిక్‌ని ప్లే చేయలేదు. మ్యూజిక్ ట్రాక్‌తో కూడా ఎడిట్ చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఖబూల్‌ పోస్టర్‌ల కోసం తీసింది అని కామెంట్ పెట్టారు.

Read More:

ఈ ఏడాదిలో రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

మాధవన్‌ని ‘కిస్’‌ చేయాలంటే చిన్నపాటి గుండెపోటు వచ్చింది

సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి..
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి..
విన్నర్ ఎవరో గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది..
విన్నర్ ఎవరో గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది..