మాధవన్‌ని ‘కిస్’‌ చేయాలంటే చిన్నపాటి గుండెపోటు వచ్చింది

రొమాంటిక్, బోల్డ్‌ సీన్లలో నటించడంలో బిపాసా బసుకు మంచి పేరుంది. అయితే అలాంటి ఈ నటి, మాధవన్‌ని కిస్‌ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిందట.

మాధవన్‌ని 'కిస్'‌ చేయాలంటే చిన్నపాటి గుండెపోటు వచ్చింది
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 4:24 PM

Bipasa Kiss scene with Madhavan: రొమాంటిక్, బోల్డ్‌ సీన్లలో నటించడంలో బిపాసా బసుకు మంచి పేరుంది. అయితే అలాంటి ఈ నటి, మాధవన్‌ని కిస్‌ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది బిపాసా. ఈ ఇద్దరు జోడీ బ్రేకర్స్ అనే చిత్రంలో కలిసి నటించారు. అప్పటికే ఈ ఇద్దరు మంచి స్నేహితులు కాగా.. మాధవన్‌కి ముద్దు పెట్టాలంటే చాలా బిపాసాకు చాలా ఇబ్బంది అనిపించిదట.

దీనిపై మాట్లాడుతూ.. ”ఒక నటిగా సాన్నిహిత్యంగా ఉన్న సన్నివేశాల్లో నటించడం నాకు కాస్త కష్టంతో కూడుకున్నదే. జోడీ బ్రేకర్స్‌లో మాధవన్‌ని కిస్‌ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. ముందు రోజు చిన్న పాటి గుండె పోటు వచ్చినట్లు అయ్యింది. మాధవన్ నాకు మంచి స్నేహితుడు. ఈ సీన్‌ ఎలా చేయాలన్న ఆలోచనలో ఉండిపోయాను. ఎలాగోలా ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినప్పుడు మాధవన్ సహా అక్కడున్న అందరూ చాలా నవ్వారు. సాన్నిహిత్య సన్నివేశాల్లో నటించేముందు సెట్‌లో నేను నడుస్తూ, మాట్లాడుతూ ఉంటా. అక్కడున్న అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటాసస అని బిపాసా తెలిపారు.

Read More:

భారీ వర్షాలు.. ఊడుతోన్న విమానాశ్రయ పైకప్పు

Bigg Boss 4: హౌజ్‌లోకి వెళ్లేది వీరే.. చక్కర్లు కొడుతోన్న లిస్ట్!