T20 World Cup: ముంబైలో రోహిత్ ప్లేస్‌కే ఎసరు పెట్టాడు.. కట్‌చేస్తే.. పాపం, టీ20 ప్రపంచకప్ నుంచే లేకుండా పోయాడుగా..

Hardik Pandya: ఇటువంటి పరిస్థితిలో, పేలవమైన ప్రదర్శనను చూసి, సెలెక్టర్లు అతని స్థానంలో మరొక ఆల్ రౌండర్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇందులో చెన్నైకి చెందిన శివమ్ దూబే ముందున్నాడు. శివమ్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. శివమ్ ఆడిన దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ తన జట్టు కోసం పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 3 అర్ధ సెంచరీలు సాధించాడు. జట్టుకు సరైన సమయంలో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.

T20 World Cup: ముంబైలో రోహిత్ ప్లేస్‌కే ఎసరు పెట్టాడు.. కట్‌చేస్తే.. పాపం, టీ20 ప్రపంచకప్ నుంచే లేకుండా పోయాడుగా..
Team India Hardik Pandya
Follow us

|

Updated on: Apr 28, 2024 | 11:19 AM

T20 World Cup 2024, Hardik Pandya: టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా జరిగింది. త్వరలో సెలక్టర్లు 15 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించనున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా కొంతకాలం క్రితం వరకు జట్టులో హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పాలనే చర్చ జరిగినా.. నేడు అదే ఆటగాడిని జట్టులో ఎంపిక చేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అవును, హార్దిక్ పాండ్యాకు సంబంధించిన హాట్ చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, టీ20 వరల్డ్‌కప్‌కు టీమ్‌ఇండియాలో ఎంపికయ్యేలా అతని ప్రదర్శన లేదని తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో పాండ్యా 9 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 197 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒక్క మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. అతని బౌలింగ్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. 9 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ సమయంలో హార్దిక్ బౌలింగ్‌ను ప్రత్యర్థులు చిత్తుగా బాదేస్తున్నారు. అలాగే, అతని కెప్టెన్సీ కూడా బాగోలేదు.

ఇటువంటి పరిస్థితిలో, పేలవమైన ప్రదర్శనను చూసి, సెలెక్టర్లు అతని స్థానంలో మరొక ఆల్ రౌండర్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇందులో చెన్నైకి చెందిన శివమ్ దూబే ముందున్నాడు. శివమ్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. శివమ్ ఆడిన దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ తన జట్టు కోసం పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 3 అర్ధ సెంచరీలు సాధించాడు. జట్టుకు సరైన సమయంలో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..