భారీగా జీతాలు పెంచారు.. కానీ, ఓ కండీషన్ పెట్టారు

11 May 2024

TV9 Telugu

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌నకు ముందు దేశ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి, శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ఆ దేశ క్రికెట్ ఆటగాళ్ల వేతనాన్ని భారీగా పెంచింది. 

ఆటగాళ్ల జీతాలు పెంచిన లంక

శ్రీలంక అంతర్జాతీయ ఆటగాళ్ల అన్ని కేటగిరీల ఫీజులను తక్షణం అమల్లోకి తెచ్చినట్లు SLC శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 

తక్షణం అమల్లోకి

మొత్తం 41 మంది ఆటగాళ్లకు A1, A2, B2, C1, C2, 'A' కేటగిరీలమేరకు 6 వేర్వేరు కేటగిరీల కింద కాంట్రాక్టులు ఇచ్చింది. 

6 వేర్వేరు కేటగిరీలు

టెస్టు క్రికెట్ ఆడే ఆటగాళ్ల జీతం గరిష్టంగా 100 శాతం పెరిగింది. SLC టెస్ట్ మ్యాచ్‌లో గెలుపొందడం, ఓడిపోవడం, డ్రా చేయడం ఆధారంగా జీతం మారుతుందని తెలిపింది.

100 శాతం పెరిగిన జీతాలు

టెస్ట్‌ల మ్యాచ్ ఫీజు అసలు $7500 నుంచి గరిష్టంగా $15,000 వరకు ఒక మ్యాచ్ గెలిచినందుకు పెంచింది. 

టెస్టులకు ప్రోత్సాహం

టెస్ట్ డ్రాగా ముగిస్తే, 66% అంటే జీతం $12,000 ఇస్తుంది. అయితే ఓడిపోతే 33% $10,000 ఇవ్వనుంది.

ఓడితే మాత్రం జీతం కట్

SLC సీఈవో ఆష్లే డి సిల్వా మాట్లాడుతూ, టెస్ట్ ఫార్మాట్‌కు 100% జీతం పెంపుదల క్రికెట్  ఐకానిక్ ఫార్మాట్ వారసత్వాన్ని రక్షించడంలో శ్రీలంక నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. 

టెస్టులకు ప్రాధాన్యం

అలాగే, ODI, T20ల మ్యాచ్ ఫీజులను అసలు మొత్తం $3000 నుంచి $4000కి పెంచింది (25% వేతనం పెంపుతో).

వన్డేలు, టీ20లు