ఈ సారి పాట మాత్రమే కాదు గిటార్ కూడా
కంప్లీట్ షట్‌డౌన్ అయిపోయింది. కరోనా వచ్చి అందర్నీ ఇంట్లో కూర్చోబెట్టింది. అందుకు సినిమా తారలు కూడా మినహాయింపు కాదు. ఈ క్రమంలో సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.

కంప్లీట్ షట్‌డౌన్ అయిపోయింది. కరోనా వచ్చి అందర్నీ ఇంట్లో కూర్చోబెట్టింది. అందుకు సినిమా తారలు కూడా మినహాయింపు కాదు. ఈ క్రమంలో సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. మరికొంతమంది తమలోని కొత్త టాలెంట్స్ బయటకు తీస్తున్నారు. తాజాగా అందాల రాశీ ఖన్నా గిటార్ పట్టి సింగర్‌గా మారారు. ‘హుషారు’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ఎంతో మంది సంగీత ప్రియులను ఆకట్టుకున్న ‘ఉండిపోరాదే’ సాడ్ వెర్షన్ పాటను పాడి ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. సహజంగానే మంచి సింగర్ అయిన రాశీ..ఈ పాటతో అందర్నీ అలరించారు.
గతంలో ‘జోరు’ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను ఆలపించి ఆడియెన్స్‌ను మెప్పించింది రాశీ. సుప్రీం హీరో సాయి తేజ్ నటించిన ‘జవాన్’ చిత్రంలోనూ ‘బంగారు’ పాటను పాడింది.
Also Read :
పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు




