అతడే శ్రీమన్నారాయణ : రివ్యూ
చిత్రం: అతడే శ్రీమన్నారాయణ దర్శకత్వం: సచిన్ రవి ప్రొడ్యూసర్: హె.కె.ప్రకాష్, పుష్కర మల్లికార్జునయ్య నటీనటులు: రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవాస్తవ, అచ్యుత్ కుమార్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి, మధుసూదన్ రావు తదితరులు సంగీతం: చరణ్‌రాజ్, బి.అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్ కెమెరా: కార్మ్ చావ్లా ఎడిటింగ్: సచిన్ రవి విడుదల: 01.01.2020 కథ, కథనాలు ప్రేక్షకుల మనసును ఆకట్టుకునే విధంగా ఉంటే అనువాద సినిమాలు కూడా బాగా ఆడుతాయి. పొరుగు భాషల చిత్రాలు […]
చిత్రం: అతడే శ్రీమన్నారాయణ దర్శకత్వం: సచిన్ రవి ప్రొడ్యూసర్: హె.కె.ప్రకాష్, పుష్కర మల్లికార్జునయ్య నటీనటులు: రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవాస్తవ, అచ్యుత్ కుమార్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి, మధుసూదన్ రావు తదితరులు సంగీతం: చరణ్‌రాజ్, బి.అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్ కెమెరా: కార్మ్ చావ్లా ఎడిటింగ్: సచిన్ రవి విడుదల: 01.01.2020
కథ, కథనాలు ప్రేక్షకుల మనసును ఆకట్టుకునే విధంగా ఉంటే అనువాద సినిమాలు కూడా బాగా ఆడుతాయి. పొరుగు భాషల చిత్రాలు తెలుగులో అనువాదమై ఘన విజయాలు సాధించిన సందర్భాలు గతంలోనూ కోకొల్లలున్నాయి. ఇటీవలి కాలంలో కన్నడ హీరోలకు తెలుగు మార్కెట్ మీద మరింత ఆశ పెంచిన సినిమా కేజీఎఫ్. యశ్ నటించిన కేజీఎఫ్ అనూహ్యంగా హిట్ కావడంతో అందరి దృష్టీ తెలుగు మార్కెట్‌పై పడింది. కేజీఎఫ్ యశ్‌ను అనుసరిస్తూ కన్నడ హీరో రక్షిత్ శెట్టి కూడా తెలుగులో కొత్త సంవత్సరం రోజున లక్ పరీక్షించుకున్నారు. ఆయన నటించిన కన్నడ చిత్రం అవనే శ్రీమన్నారాయణ తెలుగులో అతడే శ్రీమన్నారాయణ పేరుతో విడుదలైంది. కథా కథనాల్లోకి వెళ్తే…
కథ నారాయణ (రక్షిత్ శెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్. అదే ఊర్లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంటుంది లక్ష్మి (శాన్వి శ్రీవాస్తవ్). అభీరుల కుటుంబానికి చెందిన రామరామ (మధూసూదన్ రావు) ఓ డ్రామా కంపెనీ నుంచి సంపదను కొల్లగొడతాడు. పైగా డ్రామా కంపెనీకి చెందిన ఆరుగురిని చంపుతాడు. రామరామకు జయరామ (బాలాజీ మనోహర్), తుకారామ (ప్రమోద్ శెట్టి) అని ఇద్దరు కుమారులుంటారు. చిన్నవాడు తుకారామ మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తుంటాడు రామ రామ. అది నచ్చని జయరామ తండ్రి చావుకు కారణమవుతాడు. చావుబతుకుల మధ్య ఉన్నరామరామ తన కుమారుడు జయరామ మీద తనకున్న అసలైన ప్రేమను వ్యక్తం చేస్తాడు. తన స్థానంలో కొడుకు జయరామను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేనని అంటాడు. డ్రామా కంపెనీ వంశాన్ని మొత్తం నాశనం చేయాలని కొడుకు దగ్గర హామీ తీసుకుని కన్నుమూస్తాడు. తండ్రి మరణానికి కారణమైనందుకు పశ్చాత్తాప పడతాడు జయరామ. తనకోటలో తనకు తెలియకుండా గాలి కూడా దూరనంత పకడ్బందీగా ఉంటాడు. అలాంటి వ్యక్తి కోటలోకి నారాయణ వెళ్తాడు. నిధుల కోసం వేట సాగిస్తాడు. నిధులకు డ్రామా కంపెనీ వాళ్లకూ ఉన్న సంబంధం ఏంటి? డ్రామా కంపెనీ సభ్యులు నారాయణను చూసి శ్రీహరి అని ఎందుకు అనుకున్నారు? తమ శ్రీహరిని పెళ్లి చేసుకోమని లక్ష్మిని ఎందుకు బలవంతం పెట్టారు? తండ్రి మరణించినప్పటి నుంచీ మాటాపలుకూ లేకుండా ఉన్న జయరామ, తుకారామ కలుసుకున్నారా? వాళ్లిద్దరూ ఎదురుపడ్డ సందర్భం ఎలాంటిది? చివరికి జయరామ ఎలాంటి ముగింపును చూశాడు? లక్ష్మికి శ్రీహరి మీద ప్రేమ పుట్టిందా? పారిజాత చెట్టుకింద నారాయణకు దొరికిన నిధి ఏమైంది? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
ప్లస్ పాయింట్లు – కెమెరా – లొకేషన్లు, సెట్టింగ్స్ – నటీనటుల పెర్ఫార్మెన్స్
మైనస్ పాయింట్లు – ఆద్యంతం నిదానంగా సాగుతుంది – ప్రీ ఇంటర్వెల్ సీన్‌లో హీరో మాటలు వింటే… అప్పటిదాకా సినిమా చూడాల్సిన అవసరం లేదు – పాటలు నచ్చవు – డైలాగులు కూడా సరళభాషలో ఉండవు
విశ్లేషణ కన్నడ సినిమా ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకుల అభిరుచికీ చాలా తేడా ఉంటుంది. అక్కడ నిదానంగా సాగే స్క్రీన్‌ప్లేతో ఉండే చాలా సినిమాలు హిట్ అవుతాయి. కానీ మన దగ్గర స్క్రీన్‌ప్లే నిదానంగా ఉంటే ప్రేక్షకుడికి విసుగొస్తుంది. పైగా డ్రామా కంపెనీలు, నిధులకు సంబంధించిన కంటెంట్ ఎప్పుడో పాతబడిపోయింది. ఒకవేళ కౌబాయ్ కాన్సెప్ట్ నీ, ట్రెజర్‌హంట్‌నీ మిక్స్ చేసినా వీరలెవల్లో వీఎఫ్ ఎక్స్ ఉంటే తప్ప మనకు రుచించదు. అలాంటిది ఆద్యంతం డీ గ్లామర్ పాత్రలో హీరోయిన్, ఎందుకు అటూ ఇటూ తిరుగుతున్నాడో అర్థం కాని హీరో, డ్రామా కంపెనీ.. అని విసుగు తెప్పిస్తుంది అతడే శ్రీమన్నారాయణ చిత్రం. కన్నడలో ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే. పైగా తెలియని ముఖాలు మనకు పెద్దగా గుర్తుండవు కూడా.
ఫైనల్‌గా…. అతడే శ్రీమన్నారాయణ.. మనకు పెద్దగా నచ్చడు – డా.చల్లా భాగ్యలక్ష్మీ