AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Alludu Adhurs’ Review : కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల్లుడు అదుర్స్ ‘..

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ చాలాకాలం తర్వాత రాక్షసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. అదే జోష్ లో అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు...

'Alludu Adhurs' Review : కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'అల్లుడు అదుర్స్ '..
Rajeev Rayala
| Edited By: Sanjay Kasula|

Updated on: Jan 16, 2021 | 9:12 PM

Share

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్

దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్

నిర్మాత‌లు : సంతోష్ శ్రీనివాస్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ చాలాకాలం తర్వాత రాక్షసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. అదే జోష్ లో అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు.ఇక ఈ సినిమా జనవరి 14 ( గురువారం ) సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభనటేష్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం..

కథ : 

హైస్కూల్ లో శ్రీను( బెల్లం కొండ శ్రీనివాస్ )వసుందర ( అను ఇమాన్యుల్ )ను ప్రేమిస్తాడు కానీ ఆ ప్రేమ విఫలం అవుతుంది. అప్పటినుంచి అమ్మాయిలకు దూరంగా ఉంటూ వస్తాడు. ఈ క్రమంలో పెద్దవాడైన తర్వాత కౌముది ( నభనటేష్ ) పరిచయం అవుతుంది. ఆమె తో శ్రీను ప్రేమలో పడతాడు. కౌముదిని ప్రేమలో పడేసే టైంకి అతని జీవితంలోకి గజా( సోనూసూద్ ) అడుగు పెడతాడు. ఇంతలో కౌముది తండ్రి జైపాల్ రెడ్డి ( ప్రకాష్ రాజ్ )తో ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు శ్రీను. అసలు గజా ఎవరు..? వసుందర కు ఏమైంది..? ప్రకాష్ రాజ్ తో శ్రీను కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి.? ఇదంతా మిగిలిన కథ. ఈ కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఎవరెలా చేసారంటే..

బెల్లంకొండ శ్రీనివాస్ తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ నాభ నటేష్ తన తన గ్లామర్ తో స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తనకు కలిసొచ్చిన కామెడీ యాంగిల్ లో ప్రేక్షకులను అలరించాడు. ఇక సోనూసూద్, ప్రకాష్ రాజ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. మరో హీరోయిన్ అను ఇమాన్యుల్ పేట్రెక్కువ సేపు కనిపించకపోయినా ఉన్నత సేపు మంచి నటనను కనబరిచింది. వెన్నెల కిషోర్ తన కామెడీతో కాస్త నవ్విచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలపరిధి మేరకు నటించారు.

సమీక్ష : 

రొటీన్ కథ అయినా కూడా కథనాన్ని దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. సోనూ సూద్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. దేవి శ్రీ సంగీతం అలరించింది. ముఖ్యంగా సౌండ్, పాటల్లోని కొన్ని బిట్స్ చాలా బాగున్నాయి. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. సినిమాటోగ్రఫర్ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

చివరగా..

కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల్లుడు అదుర్స్’