AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూవీ రివ్యూ: ‘థ్రిల్’‌ను పెంచే ‘రెడ్’ మూవీ.. ఉస్తాద్ ‘రామ్’ డబుల్ యాక్షన్ అదుర్స్..

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్’కు...

మూవీ రివ్యూ: 'థ్రిల్'‌ను పెంచే 'రెడ్' మూవీ.. ఉస్తాద్ 'రామ్' డబుల్ యాక్షన్ అదుర్స్..
Ravi Kiran
|

Updated on: Jan 14, 2021 | 4:09 PM

Share

RED Telugu Movie Review:

టైటిల్ : ‘రెడ్’

తారాగణం : రామ్ పోతినేని, మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేధా పేతురాజ్, సంపత్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, హెబ్బా పటేల్ తదితరులు

సంగీతం : మణిశర్మ

నిర్మాత : స్రవంతి రవికిషోర్

దర్శకత్వం : కిషోర్ తిరుమల

విడుదల తేదీ: 14-01-2021

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్’కు ఇది రీమేక్. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. నివేదా పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా విడుదలకు ఆలస్యమైన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమేరకు మెప్పించిందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ‌ :

ఈ సినిమాలో రామ్ ఆదిత్య, సిద్ధార్థ్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. సిద్ధార్థ్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా.. ఆదిత్య జులాయిగా తిరుగుతూ మోసాలకు పాల్పడుతుంటాడు. ఒకానొక రోజు ఆకాష్ అనే వ్యక్తి హత్య కేసులో సిద్ధార్థ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక ఆదిత్య సైతం ఇదే హత్య కేసులో ఇరుక్కోవడంతో కథలో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. అసలు ఇంతకీ ఎవరా ఆకాష్.? ఈ మర్డర్ వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి.? వీరిద్దరి కథలో గాయత్రి(అమృత అయ్యర్), మహిమ(మాళవిక శర్మ) పాత్రలు ఏంటి.? అనే ప్రశ్నలకు సమాధానం వెండితెరపై చూడాల్సిందే.

న‌టీన‌టుల అభినయం:

మొదటిసారి ద్విపాత్రాభినయం చేసినా.. వైవిధ్యాన్ని చూపిస్తూ రెండు పాత్రల్లోనూ రామ్ ఒదిగిపోయి నటించాడు. ఇక కథానాయికలు మాళవిక, అమ్రిత విషయానికి వస్తే.. వారి పాత్రల నిడివి తక్కువే అయినా.. కథలో ప్రాధాన్యత ఉండేవని చెప్పాలి. అటు ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్, సీఐ నాగేంద్ర కుమార్‌గా సంపత్‌లు కథలో కీలకం కాగా.. సత్య అక్కడక్కడా నవ్విస్తాడు.

విశ్లేష‌ణ‌ :

రామ్ డబుల్ రోల్.. థ్రిల్లర్ కథాంశం.. మాతృక తమిళంలో సూపర్ హిట్.. ఇలా ఎన్నో రీజన్స్ సగటు ప్రేక్షకుడు రెడ్ సినిమా చూసేందుకు ఉన్నాయి. దర్శకుడు కిషోర్ తిరుమల మాతృకలో ఎలాంటి మార్పులు చేయకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్టు కుటుంబ నేపధ్యం, ప్రేమకు సంబంధించిన అంశాలను అదనంగా జోడించి చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ సినిమా ప్రధాన ఆకర్షణ రామ్ డబుల్ రోల్ కాగా.. మరో బిగ్ అసెట్ కిషోర్ తిరుమల స్క్రీన్ ప్లే. ఆయన థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా అందరికీ ఈ సినిమా చేరువయ్యేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్స్, ద్వితీయార్ధం ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తాయి. హత్య కేసు మిస్టరీని సాల్వ్ చేసే క్రమంలో మొదలైన పరిశోధనలు ఆసక్తికరంగా ఉంటాయి.

సాంకేతిక విభాగాల పనితీరు:

అన్ని సాంకేతిక విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. మణిశర్మ నేపధ్య సంగీతం.. డించక్.. డించక్, నువ్వే.. నువ్వే పాటలు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. దర్శకుడు కిషోర్ తిరుమల టేకింగ్.. తనదైన మార్క్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరి మాట: ప్రేక్షకుల థ్రిల్‌ను మరింతగా పెంచే ‘రెడ్’

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్