Ravi Teja : ఫస్ట్ టైం అందుకున్న రెమ్యునరేషన్ గురించి చెప్పిన రవితేజ.. ఎంత తీసుకున్నారంటే..

మాస్ మహారాజా రవితేజ ఈ పేరుకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎలాంటి సినీనేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి హీరోగా తనకంటూ..

  • Rajeev Rayala
  • Publish Date - 3:50 pm, Thu, 14 January 21
Ravi Teja : ఫస్ట్ టైం అందుకున్న రెమ్యునరేషన్ గురించి చెప్పిన రవితేజ.. ఎంత తీసుకున్నారంటే..

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ఈ పేరుకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎలాంటి సినీనేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రవితేజను అభిమానించేవారు లక్షల్లో ఉన్నారు. తనదైన యాటిట్యూడ్ తో హిట్లు- ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు మాస్ రాజా.

ఇటీవల ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు కమిట్ అయ్యాడు ఈ క్రాక్ హీరో. తన ‘వీర’ సినిమా తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిపి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక క్రాక్ సినిమా సక్సెస్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ.. తన కెరియర్ స్టార్టింగ్ లో జరిగిన విషయలను పంచుకున్నారు. తన లైఫ్ లో తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ టైం ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాక నాగార్జున సంతకం చేసిన చెక్ చేతికిచ్చారు. ఇక అందులో అమౌంట్ వచ్చేసి మూడువేల ఐదు వందలు. ఆ చెక్కును చాలారోజులు భద్రంగా దాచుకున్నాను. తర్వాత మనీ బాగా అవసరమై చెక్ బ్యాంకులో ఇచ్చేసా..’ అంటూ చెప్పుకొచ్చారు రవితేజ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘Alludu Adhurs’ Review : రొటీన్ కథతో సాగిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల్లుడు అదుర్స్ ‘

మూవీ రివ్యూ: ‘థ్రిల్’‌ను పెంచే ‘రెడ్’ మూవీ.. ఉస్తాద్ ‘రామ్’ డబుల్ యాక్షన్ అదుర్స్..