‘మాస్టర్’ రివ్యూ.. ఊరమాస్ ఎంటర్‌టైనర్.. దళపతిని డామినేట్ చేసిన సేతుపతి… విజయ్ vs విజయ్..

తమిళ స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. మాములుగా విజయ్...

'మాస్టర్' రివ్యూ.. ఊరమాస్ ఎంటర్‌టైనర్.. దళపతిని డామినేట్ చేసిన సేతుపతి... విజయ్ vs విజయ్..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 4:15 PM

Master Movie Review:

టైటిల్ : ‘మాస్టర్’

తారాగణం : ‘దళపతి’ విజయ్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, ఆండ్రియా తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్

నిర్మాత : గ్జావియర్ బ్రిట్టో

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్

విడుదల తేదీ: 13-01-2021

తమిళ స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. మాములుగా విజయ్ మూవీ అంటేనే తమిళ ఫ్యాన్స్‌లో క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు సేతుపతి కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఇంతకముందు లేనంతగా అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ‌ :

జేడీ(విజయ్) ఓ తాగుబోతు కాలేజీ ప్రొఫెసర్. వ్యక్తిగతంగా ఫుల్‌గా తాగుతూ.. టైం పాస్ చేస్తూ.. స్టూడెంట్స్‌ను వెంటపెట్టుకుని తిరుగుతుండటం మేనేజ్‌మెంట్‌కు నచ్చదు. అటు చారు(మాళవిక) అనే లేడీ ప్రొఫెసర్‌తో ప్రేమలో పడతాడు. ఈ తరుణంలోనే కాలేజీ ఎలక్షన్స్ వస్తాయి. అందులో జేడీ సపోర్ట్ ఉన్న వ్యక్తి గెలుస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో గొడవలు జరగడంతో జేడీ బాల నేరస్థుల స్టేట్ అబ్జర్వేషన్ హోంకు మాస్టర్‌గా వెళ్ళాల్సి వస్తుంది.

ఇక అప్పుడే అతడి లైఫ్‌లోకి భవాని(విజయ్ సేతుపతి) వస్తాడు. కొన్ని ఊహించని పరిణామాల అనంతరం భవాని ఆగడాలకు జేడీ అడ్డుగా నిలుస్తాడు. అసలు ఇంతకీ భవాని ఎవరు.? ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నాడు.? జేడీ, భవాని వార్‌లో గెలిచేది ఎవరు.? అనే ప్రశ్నలకు సమాధానం వెండితెరపై చూడాల్సిందే

న‌టీన‌టుల అభినయం:

జేడీ పాత్రలో దళపతి విజయ్ చక్కగా ఒదిగిపోయారు. పేరుకు మాస్టర్ అయినా.. పక్కా ఊరమాస్ అని చెప్పవచ్చు. పాత్రకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని తన మార్క్ యాక్టింగ్‌తో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక చిత్రానికి ప్రధాన ఆకర్షణ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఆయన ప్రతీ సినిమాలో మాదిరిగానే ఇందులోనూ తను నటించిన పాత్రకు ప్రాణం పోశారు. అందం, అభినయంతో మాళవిక మోహనన్ అలరించింది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేష‌ణ‌ :

అసలే ఇద్దరూ తమిళంలో స్టార్ హీరోలు. దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అంశాలు దర్శకుడిపై ఎఫెక్ట్ పడ్డాయని చెప్పొచ్చు. అందుకే ఎలాంటి వైవిధ్యమైన కథనూ ఎంచుకోకుండా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘మాస్టర్’ను పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.

సినిమా ప్రధమార్ధం సోసోగానే ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్‌కు పెద్ద పీట వేస్తూ.. జేడీ, భవాని పాత్రలను ఎలివేట్ చేస్తూ వచ్చారు. అయితే అసలు కథ మాత్రం ద్వితీయార్ధంలో మొదలవుతుంది. హీరో, విలన్ మధ్య యుద్ధం.. ఎత్తులు, పైఎత్తులు ఇలా అన్ని కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో సగటు ప్రేక్షకుడికి సెకండాఫ్ కాస్త సాగతీతలా ఉంటుంది. అంతే తప్పితే మిగిలినదంతా కూడా బాగుంది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఓవరాల్‌గా సినిమా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. విజయ్, విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్. ఎడిటింగ్ తప్ప సాంకేతికంగా ప్రతీ విభాగం సినిమాపై తనదైన ముద్ర వేసింది. కెమెరా పనితనం.. అనిరుధ్ సంగీతం.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లే.. ప్రతీ సన్నివేశాన్ని వెండితెరపై చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరి మాట: ‘మాస్టర్’.. దళపతి అభిమానులకు ఒక్క రోజు ముందుగానే సంక్రాంతి వచ్చేసింది.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..