Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సక్సెస్‌పై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఏమన్నారంటే..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌.. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తోంది. పవన్ కళ్యాణ్‌కు సరైన కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది భీమ్లా నాయక్‌ చిత్రం. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ సినిమా...

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సక్సెస్‌పై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఏమన్నారంటే..
Bheemla Nayak Chiru
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 26, 2022 | 7:59 AM

Bheemla Nayak: భీమ్లా నాయక్‌.. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తోంది. పవన్ కళ్యాణ్‌కు సరైన కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది భీమ్లా నాయక్‌ చిత్రం. పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ను పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం భీమ్లా నాయక్‌ చిత్రానికి ఏ సినిమా పోటీ లేకపోవడం, శివరాత్రితో కలిపి వారాంతం రావడంతో సినిమా కలెక్షన్లు (Bheemla Nayak Collection) భారీగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్‌, రానాల నటనతో పాటు థమన్‌ మ్యూజిక్‌, త్రివిక్రమ్‌ డైలాగ్‌లు, సాగర్‌ దర్శకత్వం అలా అందరి పనితీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు భీమ్లా నాయక్‌ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ జాబితాలోకి మెగా స్టార్ చిరంజీవి కూడా వచ్చి చేరారు. భీమ్లా నాయక్‌ చిత్రంపై తన స్పందనను తెలియచేశారు చిరు. రానా, పవన్‌ కళ్యాణ్‌లతో సినిమా సెట్స్‌లో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన చిరు.. ‘భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. నిజంగా ఇది పవర్‌ తుఫానే’ అంటూ రాసుకొచ్చారు చిరు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓపెనింగ్స్‌ చూస్తుంటే పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో భీమ్లా నాయక్‌ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు, పవర్‌ స్టార్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేశారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కు జోడిగా నటించిన నిత్యా మీనన్‌, రానా సరసన నటించిన సయుంక్త మీనన్‌ కూడా తమ నటనతో మంచి మార్కులు కొట్టేశారు.

Also Read: RRR Movie: మళ్లీ మొదలవుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ సందడి.. ఈసారి ఏకంగా దుబాయ్‌లో..!

Samyuktha Menon : భీమ్లానాయక్ బ్యూటీకి క్యూకడుతున్న టాలీవుడ్ ఆఫర్లు..

Samyuktha Menon : భీమ్లానాయక్ బ్యూటీకి క్యూకడుతున్న టాలీవుడ్ ఆఫర్లు..

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా