AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : రెండేళ్లుగా చరణ్ పడ్డ కష్టం చూశాను.. నా మనసంతా పెద్ది దగ్గరే ఉంది.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

ప్రస్తుతం థియేటర్లలో పెద్ది సినిమా దూసుకుపోతుంది. జూన్ 4న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి ఉదయం నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు తెరకకెక్కించిన సినిమా కావడంతో మొదటి నుంచి ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో కన్నడు నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు.

Megastar Chiranjeevi : రెండేళ్లుగా చరణ్ పడ్డ కష్టం చూశాను.. నా మనసంతా పెద్ది దగ్గరే ఉంది.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..
Chiranjeevi, Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2026 | 1:29 PM

Share

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పెద్ది. కొన్నాళ్లుగా భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకు అడియన్స్ మందుకు వచ్చింది. జూన్ 4న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా.. ఉదయం నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో జాన్నీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, జగపతి బాబు దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్, మేకోవర్, అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు పవర్ ఫుల్ డైరెక్షన్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా అదిరిపోయిందని.. ముఖ్యంగా చరణ్ ఇరగదీశాడంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా పై ఇదివరకే టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం పెద్ది చిత్రంపై ఆసక్తికర ట్వీట్ చేశఆరు. గత రెండెళ్లుగా చరణ్ పడ్డ కష్టం తాను దగ్గరుండి చూశానని.. ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తుందంటూ ట్వీట్ చేశారు.

” నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. “పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకటస్ కిలారుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ నిమ్మ శివన్న గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగ్గుభాయ్ గారికి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్ గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. “పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

చిరంజీవి ట్వీట్..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us