AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాఫిక్ అలర్ట్..! అమీర్‌పేట్ వైపుగా వెళ్లేవారు వీలైతే రూటు మార్చుకోండి

హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని కేఎస్‌ఆర్‌ ఫ్యాషన్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. మెట్రో పిల్లర్ A1043 సమీపంలో జరిగిన ఈ ఘటనతో అమీర్‌పేట్-ఎస్సార్ నగర్ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ అలర్ట్..! అమీర్‌పేట్ వైపుగా వెళ్లేవారు వీలైతే రూటు మార్చుకోండి
Ameerpet Fire Accident
SN Pasha
|

Updated on: Jun 04, 2026 | 1:48 PM

Share

నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతం అయ్యే నగరవాసులకు మరో అలర్ట్ జారీ చేశారు పోలీసులు. అమీర్ పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ‘అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం.’ అని పేర్కొన్నారు.

ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్ నుంచి పంజాగుట్ట, యూసుఫ్ గూడ వైపు వెళ్లే వారు అమీర్ పేట్ నుంచి కాకుండా వేరే మార్గాల నుంచి వెళ్లడం మంచిది. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన చోటు మంటలు అదుపులోకి వస్తున్నప్పటికీ ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారింది. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు వేరే మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us