Viral Video: అబ్బబ్బా.. ఏం టాలెంట్! గాల్లోనే ఫుట్‌బాల్‌తో మ్యాజిక్ చేసిన బాలుడు
ఫిఫా వరల్డ్ కప్ 2026 సందడి మధ్య సోషల్ మీడియాలో ఓ బాలుడు ఫుట్‌బాల్ విన్యాసాల వీడియో వైరల్‌గా మారింది. గాల్లో ఎగిరే బంతిని అద్భుతంగా కంట్రోల్ చేస్తూ అతడు ప్రదర్శించిన ఫీట్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లిటిల్ రొనాల్డో అంటూ కితాబిస్తున్నారు. భారత ఫుట్‌బాల్‌కు ఇలాంటి ప్రతిభావంతులు మంచి రోజులు తీసుకురావాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫీవర్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. భారత్‌లోనూ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఫ్యాన్స్ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక బాలుడు ఫుట్‌బాల్‌తో చేస్తున్న అద్భుతమైన విన్యాసాల వీడియో వైరల్‌గా మారింది. ఫుట్‌బాల్‌లో ఆ అబ్బాయి స్కిల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫుట్‌బాల్‌లో భారత్‌కు మంచి రోజులు రావాలని కోరుకునే భారత ఫ్యాన్స్ ఈ కుర్రాడి నైపుణ్యానికి ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ కుర్రాడు ఫుట్‌బాల్‌తో అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శిస్తున్నాడు. బంతిని ఒక్క క్షణం కూడా కింద పడనీయకుండా, గాల్లోనే తన కాళ్లతో పూర్తి నియంత్రణలో ఉంచుతూ ఆడుతున్నాడు. అంత చిన్న వయసులో ఫుట్‌బాల్‌పై అంతటి పట్టు, బ్యాలెన్స్ సాధించడం అంత సులువు కాదు. అతను చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, ఆటపై అతనికి ఉన్న నిబద్ధతను, కఠిన శ్రమను తెలియజేస్తున్నాయి.
వీడియో చూడండి
View this post on Instagram
సోషల్ మీడియాలో ఈ వీడియోకు భారీ స్పందన లభిస్తోంది. ఇన్‌స్టాలో ఈ వీడియోను ఇప్పటికే 85 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించగా, 7 లక్షల 60 వేల మందికి పైగా లైక్ చేశారు. బాలుడు బంతిని తన ఇష్టానుసారంగా తిప్పుతున్న తీరును చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చాలా మంది నెటిజన్లు ఆ కుర్రాడిని పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతో పోలుస్తూ..ఛోటా రొనాల్డో..ఫ్యూచర్ రొనాల్డో అని కామెంట్లు పెడుతున్నారు. ఫుట్‌బాల్‌లో ఆ కుర్రాడిని ప్రోత్సహించాలని మరికొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలాంటి లిటిల్ స్టార్లను ప్రోత్సహిస్తే.. వరల్డ్ ఫుట్‌బాల్‌లో భారత్ కూడా ఆడే రోజులు దగ్గర్లోనే వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: స్నేక్ క్యాచర్‌పై దూసుకెళ్లిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే గుండె గుభేల్..!




