Video: అక్కను చూసి అమాయకురాలు అనుకునేరు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..
బస్సు, రైలు ఏదైనా సరే.. కాస్త రద్దీగా ఉందా, చిన్న గ్యాప్ దొరికిందా.. ఇక జేబు దొంగల చేతివాటానికి తిరుగుండదు. మన చిన్నపాటి అజాగ్రత్తే దొంగలకు వరంగా మారుతోంది. తాజాగా రైలులో నిద్రిస్తున్న ఒక వ్యక్తి జేబులోంచి ఓ మహిళ ఫోన్ కొట్టేసిన విధానం చూస్తే నోరెళ్లబెడతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బస్సు, ట్రైన్, రద్దీ ఉండే ప్లేస్‌లలో జేబు దొంగల చేతివాటం మామూలుగా ఉండదు. చిన్న గ్యాప్ దొరికితే ఉన్నది మొత్తం ఊడ్చేశారు. జనాల అజాగ్రత్తే దొంగలకు వరంగా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిత్యం రైళ్లలో పర్సులు, మొబైల్ ఫోన్లు మాయమవ్వడం చూస్తూనే ఉంటాం. కనురెప్పపాటులో జరిగే ఈ దొంగతనాలు బాధితులను కోలుకోలేని దెబ్బతీస్తాయి. ఇటీవల ఇలాంటి ఘటనే ఒకటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే రైలులో ఒక మహిళ ఎంతో చాకచక్యంగా ఫోన్ దొంగిలించిందో చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రైలులో కాస్త రద్దీగా ఉండటాన్ని ఒక మహిళ తనకు అనుకూలంగా మార్చుకుంది. పై బెర్త్‌లో ఒక వ్యక్తి ఏమరపాటుగా, హాయిగా నిద్రపోతున్నాడు. అతని ప్యాంట్ జేబులో ఫోన్ కాస్త పైకి కనిపిస్తోంది. ఇంకేముందు మహిళా దొంగ రెచ్చిపోయింది.
రైలులో ఎవరికీ అనుమానం రాకుండా మెల్లిగా అతని వద్దకు చేరి అత్యంత చాకచక్యంగా అతని జేబులోంచి ఫోన్‌ను లాగేసింది. ఆ వ్యక్తి ఎంత గాఢనిద్రలో ఉన్నాడంటే.. తన ఫోన్ పోయిందన్న విషయం కనీసం గమనించలేకపోయాడు. అయితే అదే రైలులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ సీన్‌ను తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఆధారంగానే సదరు మహిళను పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే వేలాది వ్యూస్ సాధించింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “పాపం ఆ వ్యక్తి.. మేల్కొన్న తర్వాత కానీ అసలు విషయం తెలిసి రాదు అని ఒకరు.. అతని ప్రయాణం చాలా ఖరీదైనది కానుంది’’ అని మరొకరు కామెంట్ చేశారు. మరికొంత మంది మాత్రం ఈ వీడియో నిజమైనది కాదని, కేవలం అవగాహన కోసం ముందే ప్లాన్ చేసి తీశారని అభిప్రాయపడుతున్నారు.
వీడియో చూడండి..
आपकी यात्रा मंगलमय हो pic.twitter.com/rlJa7idDc0
— Chetan sudia (@SCD41451) June 15, 2026
రైలు ప్రయాణికులకు కొన్ని ముఖ్యమైన సూచనలు..
- రైళ్లలో జరిగే జేబుదొంగతనాలు ప్రయాణికుల చిన్నపాటి నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కాబట్టి ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- ప్రయాణ సమయంలో ఫోన్లు, పర్సులను ప్యాంట్ వెనుక జేబుల్లో లేదా పై జేబుల్లో ఉంచకూడదు.
- నిద్రపోయే సమయంలో మొబైల్స్, పర్సులను చేతికి దొరకని విధంగా బ్యాగుల్లో పెట్టి, వాటిని లాక్ చేసుకోవడం సురక్షితం.
- బోగీల్లోకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చుట్టుపక్కల వారి కదలికలపై నిఘా ఉంచాలి.
