Watch Video: ఇక్కడ వస్తువులు కొనాలంటే జేబులో డబ్బులు కాదు కావల్సింది.. మీ గుండెలో ‘ధైర్యం’..!
ప్రపంచంలో ఎన్నో వింతైన దుకాణాలు ఉన్నప్పటికీ, చైనాలోని ఒక చిన్న కిరాణా దుకాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కారణం దాని ప్రత్యేక స్థానం. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న షినియుజాయ్ నేషనల్ జియోలాజికల్ పార్క్‌లో ఈ దుకాణం భూమికి సుమారు 393 అడుగుల అంటే 120 మీటర్ల ఎత్తులో, నిటారుగా ఉన్న బండరాయి అంచుపై వేలాడుతూ ఉంటుంది. ఈ దుకాణాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ దుకాణానికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. అక్కడికి వెళ్లాలంటే పర్వతారోహణ పరికరాలు ధరించాలి. తాళ్ళు, లోహపు కేబుళ్ల సహాయంతో ప్రమాదకరమైన కొండను ఎక్కాలి. దుకాణం వరకు చేరుకోవడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత అసౌకర్యమైన కిరాణా దుకాణంగా పేరుగాంచింది.
ఇక్కడ పనిచేసే ఉద్యోగుల పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే వారు వాటర్ బాటిల్స్, స్నాక్స్, ఇతర అవసరమైన వస్తువులను వీపుపై మోసుకుంటూ ప్రమాదకరమైన మార్గం గుండా దుకాణానికి చేరుకుంటారు. కొండ అంచున ఉన్న కారణంగా అక్కడ మరుగుదొడ్లు కూడా లేవు. ఒకవేళ బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తే, మొత్తం కొండ దిగిపోయి మళ్లీ పైకి ఎక్కాల్సి ఉంటుంది. అందుకే విధి నిర్వహణ సమయంలో సిబ్బంది ఎక్కువగా నీళ్లు తాగకుండా ఉంటారని చెబుతున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత ఎత్తులో ఉన్నప్పటికీ ఇక్కడ వస్తువుల ధరలు సాధారణంగానే ఉంటాయి. పర్యాటక ప్రాంతాల్లో సాధారణంగా అధిక ధరలు వసూలు చేస్తారు. కానీ ఈ దుకాణంలో ఒక నీటి సీసా కేవలం 2 యువాన్లు (సుమారు రూ.28) మాత్రమే.
మరో విశేషం ఏమిటంటే, ఈ దుకాణం పూర్తిగా నమ్మకంపై ఆధారపడి నడుస్తుంది. ఒకేసారి ఒక్క వ్యక్తి మాత్రమే కూర్చోగలిగేంత చిన్నదైన ఈ దుకాణంలో, పర్వతారోహకులు తాము కావాల్సిన వస్తువులు తీసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్వయంగా చెల్లింపు చేస్తారు. ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నప్పటికీ, ఈ చిన్న దుకాణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
393 అడుగుల ఎత్తైన బండరాయి మీద రేషన్ షాపును ఇక్కడ చూడండి!
View this post on Instagram
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..