AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Public Talk : బాక్సాఫీస్ కా బాప్.. ఇరగదీసిన చరణ్.. క్లైమాక్స్ వేరేలెవల్ అబ్బా.. పెద్దిపై పబ్లిక్ టాక్ ఇదే..

ఒక వైపు సుకుమార్ శిష్యుడు.. ఉప్పెన సినిమాతో బాక్సాఫఈస్ షేక్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సన. మరోవైపు పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్.. ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది.. అదే పెద్ది.. పక్కా ఊర మాస్ కాంబినేషన్. మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇక థియేటర్ల వద్ద అభిమానుల సందడి గురించి చెప్పక్కర్లేదు.

Peddi Public Talk : బాక్సాఫీస్ కా బాప్.. ఇరగదీసిన చరణ్.. క్లైమాక్స్ వేరేలెవల్ అబ్బా.. పెద్దిపై పబ్లిక్ టాక్ ఇదే..
Peddi
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2026 | 12:42 PM

Share

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఈరోజు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఉదయం ఆట నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల బయట పాలాభిషేకాలు, డప్పు చప్పుళ్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా.. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ఉత్సాహంగా పంచుకుంటున్నారు. సినిమా ప్రారంభమైన క్షణం నుంచే బుచ్చిబాబు తన మార్క్ టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ సీన్, దానికి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లలో పూనకాలు తెప్పించాయని ఆడియన్స్ చెప్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని, ఆ సీన్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ రావడం ఖాయమని ప్రేక్షకులు అంటుండటంతో ఫస్ట్ హాఫ్‌కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

ద్వితీయార్థంలో కథ ఊపందుకుంటుంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, బుచ్చిబాబు రాసుకున్న ఎమోషనల్ సీన్స్, డ్రామా ప్రేక్షకులను కట్టిపడేసాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్‌లా ఉన్నాయని పబ్లిక్ చెప్తున్నారు. రామ్‌చరణ్ తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, రగ్గడ్ లుక్ అద్భుతంగా కుదిరాయని థియేటర్ల వద్ద ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత చరణ్ నటనలో ఆ స్థాయి ఇంటెన్సిటీ మళ్లీ ‘పెద్ది’లోనే చూశామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బుచ్చిబాబు టేకింగ్, చరణ్ నటన, రెహమాన్ మ్యూజిక్ ఈ మూడూ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. కామన్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీస్ కూడా మెచ్చేలా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సరికొత్త రికార్డుల వేట సాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

పెద్ది పబ్లిక్ టాక్..

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us