Manmadhudu: రీఎంట్రీకి సిద్ధమైన మన్మధుడు హీరోయిన్.. అలాంటి పాత్రలకు సై!
సెటిల్ అయ్యి ఫ్యామిలీ స్టార్ట్ చేసిన తర్వాత నటీమణులు మళ్లీ తెరపైకి రావడం కామన్ గా మారింది. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత చాలా మంది నటీమణులు తమ కెరీర్ నుంచి విరామం తీసుకుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ తో బిజీగా ఉంటున్నారు.

సెటిల్ అయ్యి ఫ్యామిలీ స్టార్ట్ చేసిన తర్వాత నటీమణులు మళ్లీ తెరపైకి రావడం కామన్ గా మారింది. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత చాలా మంది నటీమణులు తమ కెరీర్ నుంచి విరామం తీసుకుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ తో బిజీగా ఉంటున్నారు. అయితే వారి పిల్లలు పెద్దయ్యాక.. కొంత ఖాళీ సమయం ఉంటుంది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి సినిమాలవైపు మొగ్గు చూపుతుంటారు. సాధారణంగా అలనాటి హీరోయిన్స్ అత్త, అక్క, తల్లి పాత్రలను పోషిస్తారు. ఇప్పటికే ఇంద్రజ, మీనా లాంటివాళ్లు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో పాత హీరోయిన్ రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఆమెనే మన్మధుడు హీరోయిన్ అన్షు.
క్లాసిక్ మూవీ “మన్మథుడు”లో నాగార్జున ప్రేయసిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది అన్షు సగ్గర్. ‘రాఘవేంద్ర’ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది. అయితే బ్రిటీష్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె చిత్ర పరిశ్రమకు దూరమైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చారు. చురుగ్గా ఫొటోలను మీడియాతో పంచుకుంటున్నారు. దీంతో ఆమె మళ్లీ కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో పాత్రలు పోషించాలనే ఆలోచనను సూచిస్తోంది.
హీరో నాగార్జున తో రొమాన్స్ చేసిన ఈ హీరోయిన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మన్మధుడు, రాఘవేంద్ర సినిమాలతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ, వరుస సినిమాలు క్యూ కడుతున్నప్పటికీ సడన్ గా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


