- Telugu News Photo Gallery Cinema photos Prabhas Salaar to Pooja Hegde New Movie latest cinema updates from film industry
.Film Updates: దేవా.. యుద్ధభూమిలో కలుద్దాం! పృథ్విరాజ్.. బాలీవుడ్‌లో పూజ..
దేవా, త్వరలో యుద్ధభూమిలో కలుద్దాం అంటూ పృథ్విరాజ్ సుకుమార్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న మలయాళ సినిమా మంజుమల్ బోయ్స్. హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఎంజీఆర్ అభిమానిగా నటించనున్నారు హీరో కార్తి. నలన్ కుమారస్వామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే మరో బాలీవుడ్ సినిమా కోసం రెడీ అవుతున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Mar 12, 2024 | 10:08 AM

దేవా, త్వరలో యుద్ధభూమిలో కలుద్దాం అంటూ పృథ్విరాజ్ సుకుమార్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయన వరదరాజ మన్నార్‌గా నటించిన సినిమా సలార్. ఆ చిత్రంలో దేవా కేరక్టర్ చేశారు ప్రభాస్. ఇటీవల విడుదలైన సలార్ ఫస్ట్ పార్ట్ కి మంచి స్పందన వచ్చింది. సెకండ్ పార్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పృథ్విరాజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

హిట్ టాక్‌తో దూసుకుపోతున్న మలయాళ సినిమా మంజుమల్ బోయ్స్. లూసిఫర్ పేరు మీద ఇప్పటిదాకా ఉన్న రికార్డును బ్రేక్ చేసింది ఈ సినిమా. లూసిఫర్ ఆల్ టైమ్ కలెక్షన్లు 127కోట్ల రూపాయలు కాగా, మంజుమల్ బోయ్స్ కేవలం 16 రోజుల్లోనే 130 కోట్లను రాబట్టింది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటున్న సర్వైవల్ డ్రామాగా మంజుమల్ బోయ్స్ క్లిక్ అయింది.

హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఆమె నటిస్తున్న కొత్త సినిమా రీసెంట్‌గా మొదలైంది. అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఖేల్ ఖేల్ మేలో ప్రగ్యా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగులో టైసన్ నాయుడు సినిమా ఉంది.

ఎంజీఆర్ అభిమానిగా నటించనున్నారు హీరో కార్తి. నలన్ కుమారస్వామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సూర్య క్లాప్‌నిచ్చారు. ఈ సినిమాలో కార్తికి జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. వా వాదియారే అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు మేకర్స్.

పూజా హెగ్డే మరో బాలీవుడ్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ప్రస్తుతం షాహిద్‌కపూర్‌తో దేవా సినిమాలో నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సినిమా తర్వాత షాజిద్ నదియడ్‌వాలా నిర్మించే సంకీ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమెకు జోడీగా అహాన్ శెట్టి నటిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది సంకీ.





























