- Telugu News Photo Gallery Cinema photos Prabhas New Movie to Balakrishna NBK 109 latest film updates from Tollywood film industry
Telugu Movies: ప్రభాస్‌కు జోడీగా మృణాళ్.. బాలయ్య పాన్ ఇండియన్ ఎంట్రీ..
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా రాబోతుంది. నటి కళ్యాణి మాజీ భర్త, సత్యం సినిమా దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా మార్చి 21న రీ రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. నందమూరి బాలకృష్ణ కూడా పాన్ ఇండియన్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.
Updated on: Mar 12, 2024 | 9:21 AM

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా రాబోతుంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమా వస్తుంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా తన లక్కీ హీరోయిన్‌ను హను ఎంచుకున్నారని తెలుస్తుంది. సీతా రామం ఫేమ్ మృణాళ్‌నే ప్రభాస్‌కు జోడీగా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

నటి కళ్యాణి మాజీ భర్త, సత్యం సినిమా దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన కంటికి పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. అది మరింతగా పెరగడంతో మరణించారు. తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ లాంటి సినిమాలను రూపొందించారు సూర్య కిరణ్. ఆయన వయసు 48 ఏళ్లు మాత్రమే.

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా మార్చి 21న రీ రిలీజ్ కానుంది. దీనికోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర రీ రిలీజ్‌పై ఉదయ్ కిరణ్ సోదరి మాట్లాడారు. తన తమ్ముడి సినిమాను మరోసారి థియేటర్లలో విడుదల చేస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు.

విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రంలోని రెండో పాటకు ముహూర్తం పెట్టారు దర్శక నిర్మాతలు. మార్చి 12న ఫ్యామిలీ స్టార్ రెండో పాట విడుదల కానుంది. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత.

నందమూరి బాలకృష్ణ కూడా పాన్ ఇండియన్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఈయన ప్రస్తుతం నటిస్తున్న NBK 109 పాన్ ఇండియన్ సినిమా అని తెలుస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని హీరోయిన్ ఊర్వశి రౌతెలా కన్ఫర్మ్ చేసారు. తన కెరీర్‌లో నెక్ట్స్ బిగ్ థింగ్ NBK 109 అంటూ పోస్ట్ చేసారు ఊర్వశి. ఈ చిత్ర టీజర్ ఈ మధ్యే విడుదలైంది.




