- Telugu News Photo Gallery Cinema photos Even if our films are not in the ring, the focus of Indians on Oscars seems strong
Oscar: ఆస్కార్ మీద ఇండియన్స్ ఫోకస్.. ఈ ఏడాది ఎవరిని వరించింది.?
గత ఏడాది ఆస్కార్ అవార్డు ఇండియాలో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ట్రిపులార్ సాంగ్ ఆస్కార్ బరిలో నిలవటంతో దేశమంతా ఈ వేడుక కోసం ఎదురుచూసింది. ఆ వైబ్ ఈ ఏడాది కూడా కంటిన్యూ అయ్యింది. మన సినిమాలేవి బరిలో లేకపోయినా... ఈ ఏడాది కూడా ఆస్కార్ మీద ఇండియన్స్ ఫోకస్ గట్టిగానే కనిపిస్తోంది. కానీ వేదిక మీదే మన టాలెంట్ మిస్ అయ్యింది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Mar 12, 2024 | 10:35 AM

విశ్వ వేదిక మీద ఒక్కసారైనా మెరవాల్లన్న కోరిక గ్లామర్ వరల్డ్‌లో ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అందుకే ఆస్కార్ వేడుక ఎప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంటుంది. గత ఏడాది మన దేశంలో ఆస్కార్ బజ్ మరింతగా పెరిగింది. తెలుగు పాట ఆస్కార్ బరిలో నిలవటంతో హోల్ ఇండియా టాలీవుడ్‌కు సాహో అంది.

అప్పటి వరకు ఇండియన్ సినిమాలు నామినేషన్స్ వరకు మాత్రమే వెళ్లొచ్చాయి. ఫస్ట్ టైమ్ భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు రావటంతో దేశమంతా ఆ మూమెంట్స్‌ను పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. అదే వేదిక మీద డాక్యుమెంటరీ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్‌కు కూడా అవార్డు దక్కింది.

ట్రిపులార్ సాంగ్‌కు అవార్డు రావటంతో ప్రపంచమంతా ఇండియన్ సినిమా వైపు చూసింది. ఈ ఏడాది కూడా ఆస్కార్ బరిలో మన సినిమాలకు ఎంట్రీ దక్కుతుందన్న నమ్మకం కలిగింది. కానీ స్క్రూట్నీ స్టేజ్‌లోనే ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ బరిలో దిగిన మలయాళ సినిమా 2018 ఫైనల్ లిస్ట్‌లో స్థానం సంపాదించలేకపోయింది.

ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచింది ఒకే ఒక్క ఇండియన్ ప్రాజెక్ట్ 'టు కిల్ ఏ టైగర్'. జార్ఖండ్‌లో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు సాధించింది. దీంతో ఆస్కార్ వేదిక మీద కూడా ఈ డాక్యుమెంటరీకి అవార్డు ఖాయం అన్న టాక్ వినిపించింది.

ఫైనల్‌గా డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో అవార్డు సాధిస్తుందని భావించిన టు కిల్ ఏ టైగర్ కూడా నిరాశపరిచింది. ఈ కేటగిరిలో 20 డేస్ ఇన్ మారిపోల్ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. రష్యా - ఉక్రేయిన్ వార్ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను రూపొందించారు.

ముందు నుంచి ఊహించినట్టుగానే హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్ ఆస్కార్ బరిలో సత్తా చాటింది. మేజర్ కేటగిరీల్లో అవార్డులు సాధించింది ఈ మూవీ. 13 కేటగిరీల్లో పోటికి నిలిచిన ఈ సినిమాకు చాలా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ లాంటి విభాగాల్లో అవార్డు సాధించింది ఓపెన్‌హైమర్





























