Ved: ఇక్కడ చైతన్య, సమంత.. అక్కడ రితేశ్‌, జెనీలియా.. ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ కలెక్షన్లే అందుకు నిదర్శనం.

ప్రస్తుతం ఇతర భాషల్లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. తెలుగు వారి కథలకు దేశవ్యాప్తంగా ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ఇటీవలి కాలంలో హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్‌ కార్తికేయ2 వరకు కొనసాగింది..

Ved: ఇక్కడ చైతన్య, సమంత.. అక్కడ రితేశ్‌, జెనీలియా.. ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ కలెక్షన్లే అందుకు నిదర్శనం.
Ved Movie Collections
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 16, 2023 | 9:29 AM

ప్రస్తుతం ఇతర భాషల్లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. తెలుగు వారి కథలకు దేశవ్యాప్తంగా ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ఇటీవలి కాలంలో హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్‌ కార్తికేయ2 వరకు కొనసాగింది. అయితే కేవలం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రాలే కాకుండా రీమేక్‌ అయిన సినిమాలు కూడా నార్త్‌ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో తెలుగు సినిమా రీమేక్‌ నార్త్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ సినిమానే ‘వేద్‌’.. ఈ చిత్రాన్ని తెలుగులో సూపర్‌ హిట్ విజయాన్ని అందుకున్న మజిలీ చిత్రానికి రీమేక్‌గా మరాఠాలో తెరకెక్కించారు.

తెలుగులో నాగ చైతన్య, సమంత పోషించిన పాత్రల్లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనిలీయా నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరాఠాలో రీమేక్‌ అయి విడుదలైన వేద్‌ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా రూ. 44.92 కోట్ల వసూలు చేసింది. కేవలం రూ.15కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. డిసెంబరు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు రూ.3.5కోట్లు (గ్రాస్‌) వసూలు చేయగా, 15రోజుల్లో రూ.44.92కోట్లు రాబట్టింది. మరాఠా బ్లాక్‌ బస్టర్‌ ‘సైరాట్‌’ (రూ.110 కోట్లు) తర్వాత ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘వేద్‌’ నిలవడం విశేషం.

ఇదిలా ఉంటే మజిలీ సినిమా సమయానికి చై, సామ్‌ వివాహ బంధంలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే రితేశ్‌, జెనిలీయా కూడా భార్యభర్తలుగా ఈ సినిమాలో నటించడం విశేషం. ఇక ఈ సినిమా గురించి జెనిలీయా మాట్లాడుతూ.. ఒకవేళ రితేశ్‌ లేకపోతే, ఆ పాత్ర చేయడానికి మరింత సమయం పట్టేది. ఏం చేయాలనుకుంటున్నావో అది చేయడానికి ఇదే సరైన సమయమని రితేశ్‌ ప్రోత్సహించడం ద్వారానే ఇది సాధ్యమైందని జెనీలియా చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ