AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita konidela: మా తమ్ముడి విషయంలో నా కోరిక అదే.. ఉపాసన ప్రెగ్నెన్సీపై మెగా డాటర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

ఉపాసన, రామ్‌చరణ్‌లు పేరెంట్స్‌ కాబోతున్నరన్న వార్త అటు మెగా కుటుంబంతో పాటు, ఇటు అభిమానుల్లోనూ జోష్‌ని పెంచింది. ఏ క్షణంలో అయితే చిరంజీవి తమ ఇంట్లోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని ప్రకటించారో అప్పటి నుంచి ఈ వార్తల వైరల్‌ అవుతూనే ఉంది. వివాహమైన..

Sushmita konidela: మా తమ్ముడి విషయంలో నా కోరిక అదే.. ఉపాసన ప్రెగ్నెన్సీపై మెగా డాటర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.
Sushmita Konidela
Narender Vaitla
|

Updated on: Jan 16, 2023 | 8:51 AM

Share

ఉపాసన, రామ్‌చరణ్‌లు పేరెంట్స్‌ కాబోతున్నరన్న వార్త అటు మెగా కుటుంబంతో పాటు, ఇటు అభిమానుల్లోనూ జోష్‌ని పెంచింది. ఏ క్షణంలో అయితే చిరంజీవి తమ ఇంట్లోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని ప్రకటించారో అప్పటి నుంచి ఈ వార్తల వైరల్‌ అవుతూనే ఉంది. వివాహమైన దాదాపు 10 ఏళ్ల తర్వాత ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతుందన్న వార్త కుటుంబ సభ్యుల్లో సంతోషాన్ని నింపింది. మెగాస్టార్‌ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేయడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. మొదట్లో ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబోతుంది అంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి.

అయితే అనంతరం ఉపాసన చేసిన పోస్టులతో ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని తేలిపోయింది. ఇక ఉపాసన ఎప్పటికప్పుడు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఉంది. మొన్నటి మొన్న ఈ సంక్రాంతి పండుగ తనకు ఎంతో ప్రత్యేకమని, మాతృత్వాన్ని ఆస్వాదించబోతున్నానని పోస్ట్‌ చేసింది. ఇక మెగా కపుల్ పేరెంట్స్‌ కాబోతున్న వార్తపై కుటుంబ సభ్యులు కూడా అడపాదడపా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా డాటర్, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుస్మిత తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్యలో క్యాస్టూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు.

తమ తమ్ముడు బిడ్డకు జన్మనివ్వబోతున్నాడన్న వార్తపై సుస్మిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రామ్‌చరణ్‌ – ఉపాసన తల్లిదండ్రులు కానున్నారు అన్నది మా కుటుంబానికి చాలా పెద్ద శుభవార్త. ఈ వార్త కోసం మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. నాకు మేనల్లుడిని అందిస్తాడా.. మేనకోడల్ని ఇస్తాడా అన్నది చూడాలి. మాకైతే ఎవరైనా ఓకే. కాకపోతే మా ఇంట్లో ఇప్పటికే నలుగురు అమ్మాయిలం అయిపోయాం. కాబట్టి అబ్బాయి పుడితే చాలా బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి
రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి
ఇదే నిజమైన మానవత్వం,హిందూ సంప్రదాయంలో జరిగిన ముస్లింకుటుంబ పెళ్లి
ఇదే నిజమైన మానవత్వం,హిందూ సంప్రదాయంలో జరిగిన ముస్లింకుటుంబ పెళ్లి
ఏంట్రా ఈ అమ్మడు.. హీరోయిన్లకే చెమటలు పట్టించే అందం..
ఏంట్రా ఈ అమ్మడు.. హీరోయిన్లకే చెమటలు పట్టించే అందం..
జాబ్ మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..?
జాబ్ మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..?
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్
శరీరానికి ఉక్కు లాంటి బలం.. ఈ లడ్డు లాభాలు తెలిస్తే షాకే..
శరీరానికి ఉక్కు లాంటి బలం.. ఈ లడ్డు లాభాలు తెలిస్తే షాకే..