AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rocketry Movie Trailer Relese : మాధవన్ ‘రాకెట్రీ’ ట్రైలర్‌ రిలీజ్‌.. ఆయన జీనియస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిన సమంత..

Rocketry Movie Trailer Relese : ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’. ఈ సినిమాలో మాధవన్ కథానాయకుడిగా

Rocketry Movie Trailer Relese : మాధవన్ ‘రాకెట్రీ’ ట్రైలర్‌ రిలీజ్‌..  ఆయన జీనియస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిన సమంత..
Rocketry Movie Trailer Rele
uppula Raju
|

Updated on: Apr 01, 2021 | 9:33 PM

Share

Rocketry Movie Trailer Relese : ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’. ఈ సినిమాలో మాధవన్ కథానాయకుడిగా చేస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే సినిమా ట్రైలర్ చూసిన హీరోయిన్‌ సమంత ఏడ్చేసినట్లు సోషల్‌ మీడియా కేంద్రంగా తెలిపింది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు విషయాలు వెల్లడిస్తూ.. ఏడాది కిందటే తాను సినిమా ట్రైలర్ చూశానని, ఈ సినిమా తెరకెక్కించేందుకు మాధవన్ చాలా కష్టపడ్డారని, ఆయన జీనియస్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది సామ్.

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణ్ ఒకరు. కాగా ఒకానొక టైమ్‌లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. తర్వాత సుప్రీం కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఆ సైంటిస్ట్ జీవితాన్నే మాధవన్ తెరపై ఆవిష్కరించబోతున్నారు. తెలుగు, తమిళ్‌లో సూర్య ఇంటర్వ్యూయర్ రోల్ ప్లే చేయగా, హిందీలో షారుఖ్ ఖాన్ ఈ రోల్‌లో కనిపించబోతున్నాడు. ‘వీధి కుక్కను కొట్టి చంపాలంటే దానికి పిచ్చి అనే పటం కడితే సరిపోతుంది. అదే విధంగా ఓ మనిషిని తలెత్తనివ్వకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పటం కడితే చాలు’ అని సూర్య చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో సిమ్రన్ హీరోయిన్‌గా చేస్తోంది. నంబి నారాయణ్ రోల్ ప్లే చేస్తున్న మాధవన్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న సీన్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.

Rashmika Mandanna: జోరు పెంచిన మహేష్ హీరోయిన్ ఏకంగా నాలుగు భాషల్లో రాణించాలని చూస్తున్న రష్మిక..

Pawan Kalyan: ముగ్గురు రత్నాల చేతులో పవర్ స్టార్ పవన్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న పవన్..

Follow Us