Rashmika Mandanna: జోరు పెంచిన మహేష్ హీరోయిన్ ఏకంగా నాలుగు భాషల్లో రాణించాలని చూస్తున్న రష్మిక..

రష్మిక మందన్న.. ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మహేష్ సరసన నటించి,

Rashmika Mandanna: జోరు పెంచిన మహేష్ హీరోయిన్ ఏకంగా నాలుగు భాషల్లో రాణించాలని చూస్తున్న రష్మిక..
Rashmika
Follow us

|

Updated on: Apr 01, 2021 | 8:55 PM

Rashmika Mandanna: రష్మిక మందన్న.. ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మహేష్ సరసన నటించి, ప్రస్తుతం అల్లు అర్జున్తోనూ నటిస్తోంది. అందం అభినయంతో పాటు సక్సెస్‌ శాతం రేట్‌ కూడా ఎక్కువే ఉండటంతో రష్మిక డేట్స్‌ కోసం ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారట.

ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పి అక్కడ కూడ తన హవా చూపిస్తోంది. అయితే ఆ సినిమాలకంటే ముందే బాలీవుడ్‌ ప్రేక్షకులకు టాప్‌ టకర్‌ పాటలో పరిచయమైపోయింది. పరిచయమవడమే కాదు తన క్యూట్ ఎక్స్‌ ప్రెషన్స్‌ తో హిందీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రముఖ పాప్‌ సింగర్‌ బాద్‌షా, యువన్‌ శంకర్‌ రాజా, రష్మిక కలిసి.. ‘టాప్‌ టక్కర్‌’ ఆల్బమ్‌ కోసం ఆడిపాడారు. తాజాగా ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు వైరల్ గా మారింది. ఇందులో రష్మిక డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక రష్మిక అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలోనూ నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక ఆడిపాడనుంది. ఇక రష్మిక హిందీలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం పై రకరకాల వార్తలు  చక్కర్లు కొడుతున్నాయి. ‘మిషన్ మజ్ను’ అనే  బాలీవుడ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఈ చిత్రానికి శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తుండగా, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు.  ఎప్పుడో షూటింగ్ మొదలైనప్పటికీ, రష్మిక మాత్రం తాజాగా చిత్రం షూటింగులో జాయిన్ అయింది. ప్రస్తుతం లక్నోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే అటు కన్నడలో ఇటు తెలుగులో రాణిస్తున్న ఈ లక్కీ బ్యూటీ. ఇప్పుడు సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. కార్తీ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే ఈ అమ్మడికి అక్కడ కూడా ఆఫర్లు వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇలా నాలుగు భాషల్లో అమ్మడు అదరగొట్టాలని చూస్తుంది. మరి హిందీ, తమిళ్ లో రష్మిక అదృష్టం ఎంతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan: ముగ్గురు రత్నాల చేతులో పవర్ స్టార్ పవన్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న పవన్..

Nivetha Pethuraj : ‘నో కిస్’ కామెంట్‌పై స్పందించిన పాగల్ బ్యూటీ.. తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు..

Ante Sundaraniki Movie: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా నేచురల్ స్టార్.. ‘అంటే సుందరానికి’ అంటూ రాబోతున్న నాని..