Nivetha Pethuraj : ‘నో కిస్’ కామెంట్‌పై స్పందించిన పాగల్ బ్యూటీ.. తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు..

Nivetha Pethuraj : అందం, అభినయంతో పాటు విభిన్న నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించింది హీరోయిన్ నివేత పేతురాజు. వరుస

Nivetha Pethuraj : 'నో కిస్' కామెంట్‌పై స్పందించిన పాగల్ బ్యూటీ..  తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు..
Nivetha Pethuraj
Follow us

|

Updated on: Apr 01, 2021 | 8:28 PM

Nivetha Pethuraj : అందం, అభినయంతో పాటు విభిన్న నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించింది హీరోయిన్ నివేత పేతురాజు. వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీదుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు చేసిన నో కిస్ పాలసీ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఫలక్‌నుమా దాస్‌ ఫేం విశ్వక్‌ సేన్‌తో కలిసి పాగల్ సినిమాలో నటించింది.

ఈ సినిమా గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నివేద తన మొదటి సినిమా నుంచి కూడా బోల్డ్ సీన్స్‌లో, కిస్ సీన్స్ లో నటించకూడదు అని ఫిక్స్ అయినట్టు.. అలానే ఈ సినిమాలో కూడా ఆమె నో కిస్ పాలిసీని పాటించినట్టు తెలిసింది. తాజగా ఈ పుకార్ల మీద ఈ భామ ఘాటుగా స్పందించింది. “ముందుగా సినిమాలో కిస్ సీన్లు ఉన్నట్లు దర్శకుడు నాకు చెప్పలేదు.. సినిమా స్టోరీ అందంగా ఉంది.. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి” అంటూ తెలిపింది.

అంటే డైరెక్టర్ అడగలేదు కాబట్టి కిస్ సీన్స్ ఒప్పుకోలేదు.. ఒకవేళ అడిగి ఉంటే చేసేదానివా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఏది ఏమైనా నో కిస్ నియమాలు ఏమి లేవు.. నేను లిప్ లాక్స్ కి రెడీ అంటూ హింట్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. పాగల్ సినిమాలో నివేత పేతురాజు, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నరేష్ కుప్పిలి సినిమా దర్శకత్వం వహించగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాంటి ఈ సినిమా ఏప్రిల్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kirti Kulhari : బ్రేకప్ చెప్పడం అంత ఈజీ కాదు.. భర్తతో విడిపోతున్న బాలీవుడ్ బ్యూటీ.. చివరగా కామెంట్స్ పెట్టొద్దని వేడుకోలు..

ఈశాన్య భారతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.. బెంగాల్‌లో 80.43శాతం, అసోంలో 74.79 శాతం నమోదు

Surprise Gift To Employee: ఉద్యోగి ప్రతిభను మెచ్చిన కంపెనీ.. బహుమతిగా ఏం ఇచ్చిందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

Latest Articles