AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kirti Kulhari : బ్రేకప్ చెప్పడం అంత ఈజీ కాదు.. భర్తతో విడిపోతున్న బాలీవుడ్ బ్యూటీ.. చివరగా కామెంట్స్ పెట్టొద్దని వేడుకోలు..

Kirti Kulhari : 'పింక్' చిత్రం మరియు 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' అనే వెబ్ సిరీస్‌లో నటించిన బాలీవుడ్ బ్యూటీ కీర్తి కుల్హరి అందరికి తెలుసు.. తన నటనతో అందరిలో మంచి

Kirti Kulhari : బ్రేకప్ చెప్పడం అంత ఈజీ కాదు.. భర్తతో విడిపోతున్న బాలీవుడ్ బ్యూటీ.. చివరగా కామెంట్స్ పెట్టొద్దని వేడుకోలు..
Pr5
uppula Raju
|

Updated on: Apr 01, 2021 | 8:02 PM

Share

Kirti Kulhari : ‘పింక్’ చిత్రం మరియు ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన బాలీవుడ్ బ్యూటీ కీర్తి కుల్హరి అందరికి తెలుసు.. తన నటనతో అందరిలో మంచి గుర్తింపు సాధించింది. తాజాగా ఈమెకు సంబంధించి ఓ ప్రకటన నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత భర్త, నటుడు సాహిల్ సెహగల్ నుంచి విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. అతడి ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

” బ్రేకప్‌ చెప్పుకోవడమూ అంత ఈజీ ఏమీ కాదు.. కానీ తప్పడం లేదు. దయచేసి దీని గురించి ఎవరూ కామెంట్‌ చేయొద్దు. ఇప్పటికీ, ఎప్పటికీ కూడా!” అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేసింది. అంతేకాకుండా.. “నేను, నా భర్త సాహిల్‌ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. జీవితంలో మాత్రం ఎవరి దారి వారు చూసుకోవాలని ఓ నిర్ణయానికొచ్చాం. కలిసి ఉండాలనుకోవడం కన్నా విడిపోవడం చాలా కష్టం. ఎందుకంటే కలిసి జీవించినప్పుడు అందరూ దాన్ని సాదరంగా ఆహ్వానిస్తారు. కానీ విడిపోవడాన్ని ఎవరూ అంగీకరించకపోగా చాలామందిని అది బాధిస్తుంది చెప్పుకొచ్చింది”

కీర్తి.. పింక్‌, ఇందు సర్కార్‌, బ్లాక్‌మెయిల్‌, ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌, మిషన్‌ మంగళ్‌ సహా పలు చిత్రాల్లో నటించింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌లోనూ కీలక పాత్రలో కనిపించింది. అలగే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న క్రిమినల్‌ జస్టిస్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ ముఖ్య పాత్ర పోషించింది. అయితే కొందరు అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మడం లేదు.. ఈమె పోస్ట్‌ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేయడం లేదు కదా? అని అడుగుతున్నారు. మరికొందరేమో ఏంటి? నీకు పెళ్లి కూడా అయిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించడాన్ని ప్రశంసిస్తున్నారు. కానీ ఈమె మాత్రం కామెంట్స్ పెట్టోద్దని వేడుకుంటుందంటే ఈ విషయం సీరియస్ విషయమే అని కొంతమంది నమ్ముతున్నారు. కాగా కీర్తి కుల్హరి 2016 జూన్‌లో సాహిల్‌ను వివాహమాడింది.

ఈశాన్య భారతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.. బెంగాల్‌లో 80.43శాతం, అసోంలో 74.79 శాతం నమోదు

Surprise Gift To Employee: ఉద్యోగి ప్రతిభను మెచ్చిన కంపెనీ.. బహుమతిగా ఏం ఇచ్చిందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్ దంపతులు.. మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం.. ( వీడియో )