AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిహారికకు రీతూ, లావణ్య స్పెషల్ పార్టీ

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల త్వరలో శ్రీమతి కాబోతున్నారు. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను ఆమె వివాహం చేసుకోబోతున్నారు

నిహారికకు రీతూ, లావణ్య స్పెషల్ పార్టీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 26, 2020 | 10:37 AM

Share

Niharika Konidela party: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల త్వరలో శ్రీమతి కాబోతున్నారు. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను ఆమె వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబర్‌లో వీరి పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తుండగా.. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులను వరుణ్‌ తేజ్ చూసుకుంటున్నారు.

అయితే పెళ్లి నేపథ్యంలో ఆ మధ్యన తన స్నేహితులకు గోవాలో బ్యాచులర్ పార్టీ ఇచ్చారు నిహారిక. దానికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఇక తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్లు లావణ్య, రీతూ వర్మలు నిహారికకు పార్టీ ఇచ్చారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న నిహారిక.. నేను అస్సలు ఊహించలేదు. చాలా బావుంది. లవ్‌ యు లావణ్య, రీతూ, అనితా రెడ్డి అని పోస్ట్ చేశారు. దానికి శనివారం రాత్రి పార్టీ అంటూ లావణ్య త్రిపాఠి కూడా ఈ ఫొటోలను షేర్ చేశారు.

Read more:

‘వంటలక్క’ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. తెలుగు మూవీలో పవర్‌ఫుల్‌ పాత్రలో దీప

Corona: తెలంగాణలో మరింత తగ్గిన కరోనా కేసులు.. ఏడు జిల్లాల్లో ‘సున్నా’ కేసులు

Follow Us