‘వంటలక్క’ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. తెలుగు మూవీలో పవర్‌ఫుల్‌ పాత్రలో దీప

‘కార్తీక దీపం’ సీరియల్‌ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్‌.. ఇక్కడ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు

  • Manju Sandulo
  • Publish Date - 9:24 am, Mon, 26 October 20

Karthika Deepam Vantalakka: ‘కార్తీక దీపం’ సీరియల్‌ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్‌.. ఇక్కడ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. వెండితెర స్టార్‌ నటీనటులు, దర్శకుల ఇళ్లల్లోనూ సైతం వంటలక్కకు ఫ్యాన్స్ ఉండగా.. కార్తీక దీపం దేశంలోనే హయ్యెస్ట్‌ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్‌పై, వంటలక్కపై సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్‌ మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదంతా పక్కనపెడితే ఈ సీరియల్‌ ద్వారా ఇంత క్రేజ్‌ని సంపాదించుకున్న వంటలక్క.. తాజాగా మరో గుడ్‌న్యూస్‌ని వెల్లడించారు. తాను ఓ తెలుగు మూవీలో నటించబోతున్నట్లు తెలిపారు. లేడి ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో తాను పోలీస్‌గా నటిస్తున్నట్లు ప్రేమి వివరించారు. ఈ వివరాలన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి సినిమా పూర్తి అయ్యేదని ఆమె తెలిపారు. తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, అది అలా జరిగిపోయిందని ప్రేమి విశ్వనాథ్ అన్నారు. మొత్తానికి బుల్లితెరపై ఇన్నిరోజులుగా అందరినీ ఆకట్టుకుంటోన్న వంటలక్కను త్వరలోనే వెండితెరపై చూడబోతున్నామన్న మాట.

Read More:

Corona: తెలంగాణలో మరింత తగ్గిన కరోనా కేసులు.. ఏడు జిల్లాల్లో ‘సున్నా’ కేసులు

Bigg Boss 4: మోనాల్‌కి సమంత సలహా