Puneeth Rajkumar: అందుకే నేను పునీత్‌ చివరి సినిమాకు వెళ్లలేదు.. జేమ్స్‌ చిత్రంపై అప్పు సతీమణి అశ్విని ఎమోషనల్‌..

Basha Shek

Basha Shek | Edited By: Anil kumar poka

Updated on: Mar 19, 2022 | 7:31 PM

Puneeth Rajkumar : కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ (James). చేతన్ కుమార్ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ చిత్రం పునీత్‌ పుట్టినరోజు (మార్చి 17)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Puneeth Rajkumar: అందుకే నేను పునీత్‌ చివరి సినిమాకు వెళ్లలేదు.. జేమ్స్‌ చిత్రంపై అప్పు సతీమణి అశ్విని ఎమోషనల్‌..
Puneeth Rajkumar

Puneeth Rajkumar : కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ (James). చేతన్ కుమార్ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ చిత్రం పునీత్‌ పుట్టినరోజు (మార్చి 17)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, మలయాళం, తమిళ్‌ కన్నడ భాషల్లో సుమారు 4వేలకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా ఈ చిత్రం రిలీజైంది. ఇక ఈ సినిమా చూసేందుకు అప్పు ఫ్యాన్స్‌ థియేటర్లకు ఎగబడ్డారు. మొదటి షో నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. ఇక పునీత్‌కు నివాళిగా మార్చి 25వరకు కర్ణాటక అన్ని థియేటర్లలో కేవలం జేమ్స్‌ మూవీ మాత్రమే ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో అప్పును చివరి సారిగా తెరపై చూసి అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ బరువెక్కిన హృదయాలతో థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు.

అప్పూను మళ్లీ బతికించారు..

జేమ్స్‌ సినిమాను పునీత్‌ సోదరులు శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ఆయన కుమార్తె వందిత, వినయ్‌ రాజ్‌కుమార్‌, యువ రాజ్‌కుమార్‌లు వీక్షించారు. అయితే పునీత్‌ సతీమణి అశ్విని మాత్రం సినిమా చూడలేదంటోంది.’ జేమ్స్‌ సినిమా బాగా వచ్చిందని చిత్రబృందం, ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే నేను జేమ్స్ సినిమా చూడలేను. ఎందుకంటే అందరిలా నేను ఆ సినిమా చూడలేకపోవచ్చు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ల గురించి పునీత్ నాకు చాలాసార్లు చెప్పారు. ఇందుకోసం వాడుతున్న ఆధునిక టెక్నాలజీ గురించి కూడా ఆయన వివరించారు. సినిమా విడుదల రోజున అప్పు అభిమానులు రక్తదానం, నేత్రదానం, అన్నదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా అప్పును మళ్లీ బతికించారు ‘అంటూ కన్నీటి పర్యంతమయ్యారు అశ్విని. కాగా హీరోగానే కాకుండా పునీత్‌ రాజ్‌ కుమార్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించారు అప్పు. ఈ ప్రొడక్షన్‌ కంపెనీలో ఆయన భార్య అశ్విని కూడా కీలక పాత్ర పోషించారు. ‘మా సంస్థ పీఆర్‌కే ద్వారా మరికొంతమంది ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొస్తాం. మా బ్యానర్‌ నుంచి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్‌ కాపోయినా మంచి ఔట్‌పుట్‌ ఇవ్వగలిగాం. ఇక ముందు కూడా ఈ బ్యానర్‌ కొనసాగుతుంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అశ్విని.

Also Read:Summer Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్‌.. సమ్మర్‌ సెలవుల కోసం 104 ప్రత్యేక రైళ్లు..

Crime news: పెట్రోల్ సీసాలు విసిరి.. వాటర్ కనెక్షన్ కట్ చేసి.. కుమారుడి కుటుంబంపై తండ్రి కర్కశత్వం

Sugarcane Juice: వేసవి దాహార్తిని తీర్చే ప్రకృతి ప్రసాదిత వరం చెరకు రసం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu