AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి

Bheemla Nayak Bike: తమ అభిమాన నటీనటులు, సెలబ్రెటీల వేషధారణను అనుకరించడానికి ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అందుకనే ఖుషి(Khushi) బ్యాగ్స్,  బాహుబలి(Bahubali) చీరలు అంటూ మార్కెట్ లో హల్ చల్..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి
Bhimla Nayak Bike
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 19, 2022 | 7:07 PM

Share

Bheemla Nayak Bike: తమ అభిమాన నటీనటులు, సెలబ్రెటీల వేషధారణను అనుకరించడానికి ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అందుకనే ఖుషి(Khushi) బ్యాగ్స్,  బాహుబలి(Bahubali) చీరలు అంటూ మార్కెట్ లో హల్ చల్ చేస్తూ ఉంటాయి. మరి అలాంటిది తమ అభిమాన హీరో సినిమాల్లో వాడిన బైక్ ను తాము సొంతం చేసుకునే అవకాశం వస్తే.. ఇక ఆ అభిమాని ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోల అభిమానుల్లో పవన్ కళ్యాణ్ డిఫరెంట్. ఎందుకంటే అందరి హీరోలకు అభిమానులుంటే.. పవన్ కు భక్తులుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో వాడిన బైక్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. వివరాల్లోకి వెళ్తే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల మల్టీస్టారర్‌ మూవీ “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలై  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పవన్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన భీమ్లా నాయక్ మార్చి 24 న  ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. రెండు ఓటీటీ వేదికల్లో మార్చి 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆహా భీమ్లా నాయక్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు టాక్.

భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన రాయల్ ఎన్‌ఫిల్డ్ రేర్ మోడల్ బైక్ ను ఆహాలో భీమ్లా నాయక్ చూసే ప్రేక్షకులు సొంతం చేసుకొనే ఛాన్స్  ఇవ్వనుందని తెలుస్తోంది. లక్కీ డ్రా ద్వారా ఆహా సబ్ స్క్రైబర్లలో ఒకరికి ఈ బైక్ అందించనున్నారట. మార్చి 24 అర్ధరాత్రి 12 గంటలకు భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ అయిన అనంతరం ఆహా ఓటీటీని కొత్తగా సబ్ స్క్రైబ్ చేసుకొనే వారిని లక్కీ డ్రా తీసి ఒకరికి భీమ్లా నాయక్ లో పవన్ వాడిన బైక్ ను అందించన్నారట.

ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షో కి ఆదివారం రానా దగ్గుబాటి కూడా హాజరుకానున్నారు.  అదే రోజున నిత్యా మీనన్, థమన్ ఈ లక్కీ డ్రాపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఆహా ఈ ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్.  ఈ కార్యక్రమానికి మరికొందరు సినీ సెలబ్రిటీలు హాజరు కానుండగా.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా.. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆహా కొత్త సబ్ స్క్రైబర్ కు ఈ బైక్ అందించే అవకాశం ఉందట.. మరి ఆ పవన్ వాడిన బైక్ ను సొంతం చేసుకునే లక్కీ ఫెలో ఎవరో చూడాలి మరి

Also Read:

Viral Video: చెల్లెలు సైకిల్ తొక్కడానికి అక్క సాయం.. వీరి ప్రేమని మిస్ కాకండి.. వైరల్ వీడియో

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్