AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెల్లెలు సైకిల్ తొక్కడానికి అక్క సాయం.. వీరి ప్రేమని మిస్ కాకండి.. వైరల్ వీడియో

Viral Video: ఇంట్లో పెద్ద ఎవరైనా సరే.. తనకంటే చిన్నవారి ప్రేమగా చూసుకోవాలని.. బాధ్యతగా ఉండాలని భావిస్తారు. ఇక అక్క అయితే ఇంటికి మరో అమ్మ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో అక్క .. తన తోడబుట్టిన వారిని ఎంతో ప్రేమగా..

Viral Video: చెల్లెలు సైకిల్ తొక్కడానికి అక్క సాయం.. వీరి ప్రేమని మిస్ కాకండి.. వైరల్ వీడియో
Sisters Love Viral Video
Surya Kala
|

Updated on: Mar 19, 2022 | 5:34 PM

Share

Viral Video: ఇంట్లో పెద్ద ఎవరైనా సరే.. తనకంటే చిన్నవారి ప్రేమగా చూసుకోవాలని.. బాధ్యతగా ఉండాలని భావిస్తారు. ఇక అక్క అయితే ఇంటికి మరో అమ్మ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో అక్క .. తన తోడబుట్టిన వారిని ఎంతో ప్రేమగా చూస్తుంది. తన కంటే చిన్నవారి పట్ల బాధ్యతగా ఉంటూ.. కేరింగ్ తీసుకుంటుంది. తాజాగా ఓ అక్కచెల్లెల(Sisters love) వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ (goodnews_movement) పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో, ఒక అక్క తన చెల్లెలు తన సైకిల్‌పై కూర్చోవడానికి సహాయం చేయడం చూడవచ్చు.  ఈ వీడియో ఆన్‌లైన్‌లో 6 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని వైరల్‌గా మారింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ  వీడియోలో, ఒక చిన్న అమ్మాయి.. తన చెల్లెలు తన సైకిల్‌ను ఎక్కేందుకు సహాయం చేసిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అక్క సైకిల్ పక్కన పేవ్‌మెంట్‌పై మోకాళ్ళమీద వంగి ఉంది. అప్పుడు ఆమె చెల్లెలు.. తన అక్క వీపుపై ఎక్కి.. అనంతరం ప్రయత్నించి ప్రయత్నించి సైకిల్ పై విజయవంతంగా ఎక్కి.. సీటు మీద కూర్చుంది. అయితే సైకిల్ ను తొక్కడానికి చెల్లెలు వీలు కాకపోతే.. వెంటనే అక్క .. వెనుక నుంచి సైకిల్ తోస్తూ.. పెడల్ ను చేతితో నొక్కుతూ.. చెల్లెలు సైకిల్ ను తొక్కడానికి తన వంతు సహాయం చేసింది. ఈ వీడియో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్క తన చెల్లెలు విజయం సాధించడానికి ఎంతటి త్యాగానికైనా వెరవదు అని మరోసారి ఈ వీడియో సాక్ష్యంగా నిలిచింది. అక్కచెల్లెల బంధానికి అనుబంధానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

వైరల్ వీడియో:

క్యూట్ వీడియోకి నేను ఫిదా అని ఒకరు వ్యాఖ్యానించగా.. ఇద్దరు తోబుట్టువుల ప్రేమ.. చాలా మధురమైనది..  చాలా అమాయకమైన వీరి ప్రేమను ఈ క్షణాన్ని నేను  ప్రేమిస్తున్నాను, ”అని ఒకరు..  మరొక “ఈరోజు నేను చూసిన అందమైన విషయం” అని వ్యాఖ్యానించారు.

Also Read:

War Effect: దాణా లేక మూగరోదన.. పశువులకు తిండిపెట్టలేక ఏం చేస్తున్నారో తెలుసా

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్