Viral Video: ఏంటి బ్రో.. మరీ ఇంత దారుణమా?.. వారు చేసిన పనికి అవాక్కయిన జనాలు..!
Viral Video: ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంది. తమకున్న టాలెంట్ ప్రకారం.. వారి వారి కెరియర్‌లో దూసుకుపోతుంటారు. ప్రధానంగా దోపిడీదారుల విషయానికి వస్తే..
Viral Video: ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంది. తమకున్న టాలెంట్ ప్రకారం.. వారి వారి కెరియర్‌లో దూసుకుపోతుంటారు. ప్రధానంగా దోపిడీదారుల విషయానికి వస్తే.. వారి జిత్తులు, ఎత్తులు మామూలుగా ఉండవు. ఒక్కొక్కరి ఒక్కో స్టైల్ చోరీ ఉంటుంది. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు మనం ఇలాంటి వార్తలను కోకొల్లలుగా చూస్తుంటాం. అయితే, తాజాగా ఓ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వారు దోచుకున్న విధానం చూసి ప్రత్యక్ష సాక్షులతో పాటు.. నెటిజన్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ అంటూ షాక్ అవుతున్నారు.
ఇంతకీ వాళ్లు ఏం చేశారు? అంతలా షాక్ అవ్వడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచ వ్యాప్తంగా దొంగలు చాలా భిన్నంగా ఉంటారు. వారి వారి స్టైల్‌లో దోపిడీలు చేస్తుంటారు. డిఫరెంట్ రూట్స్‌ని ఫాలో అవుతుంటారు. పోలీసులకు, ప్రజలకు పట్టుబడకుండా రకరకాల ఎత్తులు, జిత్తులు వేస్తారు. అలా అందినకాడికి దోచుకెళ్తారు. కొందరు మాత్రం చుట్టూ ఎవరున్నారన్నది పట్టించుకోకుండా దోపిడీకి పాల్పడుతారు. అలాంటి ఘటనే ఓ చోట చేసుకుంది. అయితే, వీరు ఏ ఇంటినో, వ్యక్తి జేబునో, లేక చైనా స్నాచింగ్‌కో పాల్పడలేదు. కదులుతున్న వాహనం నుంచి ‘పట్టా’ లను దొంగిలించారు.
అవును.. ఓ గూడ్స్ ఆటోలో పట్టాలను తరలిస్తున్నారు. అయితే, ముగ్గురు యువకులు వాటిని టార్గెట్ చేసుకున్నారు. బైక్‌పై ఇద్దరు ఉండగా.. మరో యువకుడు రన్నింగ్ ఆటోను వెనుకవైపు నుంచి ఎక్కాడు. రోడ్డుపై వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. పబ్లిక్ కూడా వీరి చర్యను గమనిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ట్రాలీలోని పట్టాలను స్వేచ్ఛంగా దొంగిలించేశారు. ట్రాలీ ఎక్కిన వ్యక్తి ఆ పట్టాలను దొంగిలించి.. వెనుక వస్తున్న వారికి అందజేశాడు. అయితే, వీరి చోరీని కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. సీరియస్ దోపిడీ కాస్తా ఫన్నీగా మారిపోయింది. ఈ వీడియోకు 17 లక్షల వ్యూస్ రాగా, 47 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వీరి చోరీపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఫన్నీ చోరీని మీరూ చూసేయండి.
View this post on Instagram
Also read:
Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?