AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjima Mohan: కార్తిక్‌తో ప్రేయాయణం!.. అసలు విషయం చెప్పేసిన మంజిమ..

తమిళ సినిమా పరిశ్రమకు చెందిన హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్ (Gautham Karthik), మంజిమా మోహన్ (Manjima Mohan) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి.

Manjima Mohan: కార్తిక్‌తో ప్రేయాయణం!.. అసలు విషయం చెప్పేసిన మంజిమ..
Karthik And Manjima
Basha Shek
|

Updated on: May 01, 2022 | 10:01 AM

Share

తమిళ సినిమా పరిశ్రమకు చెందిన హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్ (Gautham Karthik), మంజిమా మోహన్ (Manjima Mohan) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం లభించిందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కుతుందని కోలీవుడ్‌ మీడియా కోడైకూస్తోంది. అయితే ఇప్పటివరకు అటు మంజిమా కానీ, కార్తిక్‌ కానీ తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల మంజిమా పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా తన ప్రియురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినఈ హీరో మంజిమాను ముద్దుగా మోమో అని పిలిచాడు. ‘మాంజిమా లాంటి అద్భుతమైన, శక్తిమంతమైన వ్యక్తి తన జీవితంలో ఉండటం గొప్పగా భావిస్తాను. హ్యాపీ బర్త్ డే మోమో’ అని పోస్ట్‌ పెట్టాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నది నిజమేనని చాలామంది భావించారు. కోలీవుడ్‌ మీడియా కూడా అదే చెప్పుకొచ్చింది. తాజాగా తమ రిలేషన్‌పై వస్తోన్న వార్తలపై నోరు విప్పింది మంజిమ.

‘గౌతమ్‌తో పెళ్లి అంటూ వచ్చి వార్తలు చూసి నేను షాకయ్యాను. మా తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవతారోనని భయపడ్డాను. అదృష్టం కొద్దీ ఈ పుకార్లను వారు తేలికగా తీసుకున్నారు. దీంతో నేను ఊపిరి పీల్చుకున్నాను. నా జీవితంలోని ముఖ్యమైన విషయాలను దాచే అవసరం నాకు లేదు. నిజంగా నేను ప్రేమలో ఉంటే తప్పకుండా దాన్ని అందరికీ తెలియజేస్తాను’ అని మంజిమా చెప్పుకొచ్చింది. కాగా తెలుగులో నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించిందీ కోలీవుడ్ ముద్దుగుమ్మ. ఇందులో చైతూ ప్రియురాలిగా ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విష్ణు విశాల్‌ ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించింది. ఇక అభినందన, అన్వేషణ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న నిన్నటి తరం హీరో కార్తిక్‌ వారసుడే. కాదల్‌ (తెలుగులో కడలి) తో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. మంజిమా, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ కలిసి ‘దేవరట్టం’ అనే చిత్రంలో నటించారు.

Also Read:Realme GT Neo 3: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో రానున్న తొలి ఫోన్‌ ఇదే..

Russia-Ukraine War: నేనూ యుద్ధంలో పాల్గొంటా.. అధికారులను కోరిన 98ఏళ్ల బామ్మ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

న్యూజిలాండ్‌లో బుమ్రా సతీమణి సంజన.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..