TSRTC: గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. గ్రేటర్ హైదరాబాదు జోన్ (Hyderabad Zone) పరిధిలోని సిటీ బస్సుల ఛార్జీలను హేతుబద్దీకరించింది. ఈ నెల పద్దెనిమిదవ తేదీ అంటే నిన్నటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. గ్రేటర్ హైదరాబాదు జోన్ (Hyderabad Zone) పరిధిలోని సిటీ బస్సుల ఛార్జీలను హేతుబద్దీకరించింది. ఈ నెల పద్దెనిమిదవ తేదీ అంటే నిన్నటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. సాధారణ ప్రయాణికులపై అదనపు భారం పడకుండా ఆర్టీసీ (RTC) అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్డినరీ బస్సులలో మొదటి నాలుగు స్టేజీల వరకు ఛార్జీలలో ఎలాంటి అదనపు భారం ఉండదని తెలిపారు. అలాగే మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో (Metro Express Busses) మొదటి రెండు స్టేజీల వరకు ఎలాంటి పెంపుదల ఉండదని చెప్పారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సేఫ్టీ సెస్ ను విధిస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించుటలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని.. ఈ విషయంలో ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
టీఎస్ఆర్టీసీ టికెట్ల ధరల్లో స్పల్ప మార్పులు జరిగాయి. పల్లె వెలుగు టికెట్ల ఛార్జీలను ఆర్టీసీ రౌండప్ చేసింది. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర రూ.10గా, రూ.13, రూ.14 ఉన్న టికెట్ ఛార్జీని రూ.15గా, 80 కిలోమీటర్ల దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని రూ.65గా ఆర్టీసీ నిర్ధారించింది. టోల్‌ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్సులో అయితే రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 అదనంగా ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నారు. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని TSRTC ప్రకటించింది.
Also Read
Suzuki Motor: భారత్‌లో సుజుకీ మోటార్ భారీ పెట్టబడులు.. ఎలక్ర్టిక్ వెహికిల్స్ రంగంలో..
Holi Crime: పండుగ పేరుతో పైశాచికం.. బ్లేడుతో గాట్లు.. రక్తం వస్తున్నా వదలకుండా