Madhan Bob: ఈ కమెడియన్ కూతురు ఫేమస్ సింగర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం..
దక్షిణాదిలో పాపులర్ కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్టార్ హీరోహీరోయిన్లుగా ధీటుగా ఫాలోయింగ్ సంపాదించుకున్న నటీనటుల గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఓ కమెడియన్ కూతురు నటిగా కాకుండా సింగర్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హాస్య నటీనటులు ఉన్నారు. అలాగే తమిళ సినీరంగంలోనూ పాపులర్ కమెడియన్స్ ఉన్నారు. అందులో మదన్ బాబ్ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సంగీత స్వరకర్తగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మదన్ బాబ్.. ఎన్నో హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి హాస్యనటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అతడు.. ఇటీవల తనువు చాలించాడు. ఈ ఏడాది ఆగస్టులో మదన్ బాబు కన్నుమూశారు. ప్రస్తుతం ఈ నటుడి కుటుంబంకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
మదన్ బాబుకు కూతురు, కొడుకు ఉన్నారు. ఆయన కుమార్తె తమిళంలో పాపులర్ సింగర్. ఆమె ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. ఆమె పేరు జనని మదన్. ఇప్పటివరకు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో అనేక పాటలు పాడింది. విజయ్ నటించిన సుర సినిమాలోని నాన్ నేదెలాల్ అథియా, పడిచాతవన్ చిత్రంలోని హే రోజ్ రోజ్ వంటి హిట్స్ సాంగ్స్ ఆలపించింది. ఇప్పటికీ ఆమె పాడిన పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
అలాగే మనద్ బాబ్ తనయుడు సైతం గాయకుడు కావడం విశేషం. మదన్ బాబ్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. తెనాలి చిత్రంలో డైమండ్ బాబు, ఫ్రెండ్స్ చిత్రంలో మేనేజర్ సుందరేశన్ పాత్రలకు మదన్ బాబ్ కెరీర్ మలుపు తిప్పాయి.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
