Rajinikanth: సూపర్ స్టార్ కోసం రంగంలోకి రియల్ స్టార్.. రజినీకాంత్ సినిమాలో హీరో ఉపేంద్ర.. ఇక థియేటర్లు దద్ధరిల్లాల్సిందే..
ఓవైపు వేట్టైయాన్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న వేట్టైయాన్ సినిమాలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు వేట్టైయాన్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న వేట్టైయాన్ సినిమాలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రం కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నాడని టాక్. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉంటుందో అని మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటి వరకు కూలీ సినిమాలో ఉప్పి అనే వార్త సోషల్ మీడియాలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉప్పి ఆన్ బోర్డ్ ఫర్ కూలీ అంటూ అసలు విషయం చెప్పేస్తూ ఉపేంద్ర పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఉపేంద్ర రగ్గడ్ లుక్ లో కనిపిస్తూ సినిమాపై మరింత హైప్ పెంచారు. ఉపేంద్ర తన సినీ కెరీర్‌లో తొలిసారి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఉప్పి ఈ లుక్ చూస్తే కూలీలో ఉప్పి అదరగొట్టడం గ్యారెంటీ అని తెలుస్తుంది.
ఈ చిత్రంలో శృతి హాసన్, మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా తలైవా 171 అన్నో టైటిల్ పెట్టారు. కానీ తర్వాత కూలీగా మార్చారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గిరీష్ గంగాధరన్ కెమెరా వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ప్రస్తుతం యూఐ సినిమాతో బిజీగా ఉన్నారు.
#Upendra on Board for #Coolie#Rajinikanth pic.twitter.com/2EwCmCBR59
— Movie Tamil (@MovieTamil4) August 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.