AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh: మరోసారి బాలీవుడ్ వర్సెస్ సౌత్.. కాంతారపై రణవీర్ వెకిలి మాటలు.. కన్నడిగుల ఆగ్రహం..

దేశమంటే మట్టికాదోయ్, మనుషులోయ్ అన్నాడు మన గురజాడ . సినిమా అంటే సౌత్ కాదోయ్, నార్తోయ్ అంటోది బాలీవుడ్ . సౌతేంటి నార్తేంటి. తెలుగేంటి, హిందీ ఏంటి...భిన్నత్వంలో ఏకత్వం. వసుదైక కుటుంబం కదా. మరెందుకీ ప్రాంతాల మధ్య బేధాలు. విభేదాలు అంటే అదోమాదిరిగా అవహేళ చేస్తూ వస్తోంది బాలీవుడ్‌. ఇంతకూ బాలీవుడ్ ..సౌత్ ఇండస్ట్రీ అభివృద్ధిని తట్టుకోలేకపోతోందా..? కాంతారాపై రణ్‌వీర్ సింగ్ ఎక్స్‌ప్రెషన్స్..వాంటెడ్లీ చేసిందా ?

Ranveer Singh: మరోసారి బాలీవుడ్ వర్సెస్ సౌత్.. కాంతారపై రణవీర్ వెకిలి మాటలు.. కన్నడిగుల ఆగ్రహం..
Ranveer Singh
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajitha Chanti|

Updated on: Dec 01, 2025 | 8:23 AM

Share

రణ్‌ వీర్ కాంతారా బాగుందన్నాడు. రిషబ్‌శెట్టి నటన అద్భుతమన్నాడు. కాంతార-3లో తనకు ఛాన్స్ ఇస్తారా అని కూడా అడిగాడు.. కానీ.. ఈ డైలాగ్‌లన్నీ ఒకేఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో కొట్టుకుపోయాయి. కన్నడ సంప్రదాయాల్ని అవమానించారనే కోపమే ఇప్పుడు అందరిలో కనిపిస్తోంది. 2025లో రిలీజైన అన్ని సినిమాల్లోకంటే కూడా కాంతారానే టాప్. అన్ని భాషాల్లోనూ మంచి ఆదరణ వచ్చింది సినిమాకి. దేవతకీ, దెయ్యానికీ తేడా తేలియనట్టుగా రణ్‌వీర్‌ స్టేజ్‌పై చూపించిన హావభావాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇటీవలే మరో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూడా దక్షిణాది సినిమాలపై చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. సౌతిండియన్ సినిమాల్లో విలన్లుగా బాలీవుడ్‌ హీరోలను తీసుకోవడం తనకు నచ్చడం లేదన్నారు. ఆ మాటలు ఇంకా మర్చిపోకముందే.. కన్నడ సూపర్‌ హిట్‌ సినిమాని అవహేళన చేసేలా రణ్‌వీర్‌ చేష్టలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

ఇదంతా రావడానికి కారణం..బాలీవుడ్ తనకు తాను ఎప్పుడూ ప్రైడ్‌గా ఊహించుకుంటుంది. తానే ఇండస్ట్రీ బాస్ అన్న భావనతోనే ఉండిపోయింది. కానీ బాలీవుడ్ కు మించిన రికార్డులు సౌత్ ఇండస్ట్రీ నమోదు చేస్తోంది. ఇక్కడే ఈ కాంఫ్లిక్ట్ మొదలైంది. ఇప్పుడు సౌత్ సినిమాలు దేశాన్నే చుట్టేస్తున్నాయి. స్క్రిప్టులు బలంగా…ఎమోషన్స్ డీప్‌గా…బాక్సాఫీస్ రిఫ్లెక్షన్ స్ట్రాంగ్‌గా సౌత్ ఇండస్ట్రీ ఎదిగింది. బాహుబలి నుంచి కేజీఎఫ్ వరకు, పుష్పా నుంచి కాంతారా వరకు…ప్రతి హిట్ ఇచ్చిన సందేశం ఒక్కటే. కంటెంట్ ఉన్నోడికి కటౌట్‌తో పనిలేదని, భాష ఒక అడ్డుగోడ కాదని.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

బాహుబలి ఏరేంజ్‌లో హిట్‌ అయిందో ఇండియాకే కాదు, యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ బాలీవుడ్‌ తట్టుకోలేకపోయింది. అసలు ప్రభాస్ హీరో మెటీరియలే కాదని కారుకూతలు కూసింది. ఇక ట్రిపులార్ టైములో రామ్‌చరణ్‌, తారక్‌పై బాలీవుడ్ మీడియా చేసిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్షద్ వార్సీ లాంటి నటులైతే విచక్షణ మరిచి హీరో ప్రభాస్‌ను జోకర్‌తో సంబోధించాడు. ఆదిపురుష్‌ టైములో వివేక్ అగ్నిహోత్రి అయితే ప్రభాస్‌ నటుడే కాదన్నాడు. రణవీర్ ఓవరాక్షన్ వ్యక్తిగతమా? లేదా బాలీవుడ్ అజ్ఞానానికి ప్రతిబింబమా? అన్నది పక్కన పెడితే, భారతీయ సంస్కృతిని ప్రాంతాలకు అతీతంగా గౌరవించడంలోనే కళాకారుడ్ని ఒక మెట్టుపైన నిలబెడుతుంది.. కానీ ఇక్కడే బాలీవుడ్ పలుమార్లు తప్పులు చేస్తూ వస్తోంది. సౌత్‌ ఇండస్ట్రీ తలగెరేసే హిట్‌ కొట్టిన ప్రతీసారి బాలీవుడ్‌లో ఏదో ఒక సందర్భంలో కడపు మంట తాలూకూ అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?