Ashika Ranganath: స్టార్ హీరోయిన్ ఇంట్లో విషాదం.. మేనమామ కూతురు ఆత్మహత్య.. అతడి వేధింపులే కారణం..
స్టార్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె మేనమామ కూతురు అచల్ (22) ఆత్మహత్య చేసుకుని మరణించింది. హసన్ ప్రాంతానికి చెందిన అచల్ బెంగుళూరులోని పాండురంగ నగర్ లో ఉన్న బంధువుల ఇంట్లో సూసైడ్ చేసుకుంది. నవంబర్ 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకెలితే..

టాలీవుడ్ హీరో ఆషికా రంగనాథ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె మేనమామ కూతురు అచల్ ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 22 సంవత్సరాలు. నవంబర్ 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగి 10 రోజులు గడిచినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచల్ తన దూరపు బంధువు మాయంక్ ను ప్రేమించింది. కానీ అతడు ఆమెపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అచల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆషికా రంగనాథ్ మామ కూతురు అచల్ (22) ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరబోతుండగా, ఆమె తన దూరపు బంధువు మయాంక్ తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. మాయంక్ అచల్ పెళ్లి చేసుకుంటానని ఆమె ఇంట్లో ఒప్పించాడు. కానీ అప్పటివరకు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో, మయాంక్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడని.. ఆమెకు పదే పదే ఫోన్ చేసి బెదిరించేవాడని అచల్ కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.
మాదకద్రవ్యాల బానిస అయిన మయాంక్ చాలా మంది యువతులతో శారీరక సంబంధం కలిగి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అచల్ మానసికంగా కుంగిపోయింది. ఆపై అతడు తనను వేధించడంతో తీవ్ర మనస్తాపం చెందిన అచల్.. తన బంధువుల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు సూసైడ్ పై అచల్ తల్లిదండ్రులు మయాంక్, అతడి తల్లి మైనా పై పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అచల్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
మయాంక్ తనను మోసం చేశాడని తెలుసుకున్న అచల్.. అతడికి చివరిసారిగా మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. “నా జీవితంలో నువ్వు లేకుండా నేను జీవించలేను. నువ్వు నన్ను మోసం చేసినప్పటికీ, నేను నిన్ను మర్చిపోలేను. నువ్వు నా కలలను చెడగొట్టావు. నువ్వు నన్ను మోసం చేయకపోతే, రాఘవేంద్ర స్వామిపై ప్రమాణం చేయి. నువ్వు చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించుకోవాలి” అంటూ అతడికి చివరిసారిగా మెసేజ్ చేసింది అచల్. తన నంబర్‌ను బ్లాక్ చేయవద్దని మయాంక్‌ను కూడా వేడుకుంది.
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?




