AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : అతడితో సమంత రెండో పెళ్లి అంటూ ప్రచారం.. రాజ్‌ మాజీ భార్య పోస్ట్‌ వైరల్‌

డిసెంబరు 1న సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. కోయంబత్తూరు ఈశా యోగా సెంటర్‌లో సోమవారం వీరిద్దరి వివాహమంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రాజ్ నిడమోరు మాజీ భార్య చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇద్దరి వివాహం ఆమె పరోక్షంగా స్పందించారంటున్నారు నెటిజన్స్.

Samantha : అతడితో సమంత రెండో పెళ్లి అంటూ ప్రచారం.. రాజ్‌ మాజీ భార్య పోస్ట్‌ వైరల్‌
Samantha
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2025 | 10:24 AM

Share

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత పెళ్లికి సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకోనున్నారని, డిసెంబరు 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వీరి పెళ్లి జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు (Desperate people do desperate things)’ అనే అర్థం వచ్చేలా ఒక కోట్‌ను పంచుకున్నారు. సమంత-రాజ్ పెళ్లి వార్తలు వస్తున్న సమయంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో, ఇది వారిని ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్‌తో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి సిరీస్‌లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై ఉన్న గురుభావం, ఈశా ఫౌండేషన్‌తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంత, బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న పోస్ట్‌లను సమంత ఇటీవల పంచుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ పెళ్లి వార్తలపై సమంత గానీ, రాజ్ నిడిమోరు గానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? లేక నిజంగానే వివాహం జరగనుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..

Samantha

Samantha

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?