Kajol: అదీ మేడమ్ రేంజ్.. ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.6 లక్షలు సంపాదన..!
బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆమె… ఇప్పుడు సినిమాలు దాదాపు తగ్గించేసింది. కానీ ఆమె బ్యాంక్ అకౌంట్ మాత్రం ఖాళీ కావడం లేదు… బదులుగా ప్రతి నెలా లక్షల రూపాయలు జమ అవుతూనే ఉన్నాయి. అది కూడా ..

బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆమె… ఇప్పుడు సినిమాలు దాదాపు తగ్గించేసింది. కానీ ఆమె బ్యాంక్ అకౌంట్ మాత్రం ఖాళీ కావడం లేదు… బదులుగా ప్రతి నెలా లక్షల రూపాయలు జమ అవుతూనే ఉన్నాయి. అది కూడా ఏం చేయకుండానే. మరి ఇది ఎలా సాధ్యం? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
ఏ పని చేయకుండా బ్యాంక్ అకౌంట్లో లక్షలు పడటం వెనుక కథేంటో తెలుసా? ఆమెకు ముంబయిలో బ్యాంక్ స్ట్రీట్ పక్కనే భారీ కమర్షియల్ ప్రాపర్టీ ఉంది. ఆ భవనంలోని రిటైల్ స్పేస్‌ను భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్‌కు రెంట్‌కు ఇచ్చింది. ఒప్పందం ప్రకారం 9 ఏళ్లలో ఆమెకు మొత్తం 8.6 కోట్ల రూపాయలు వస్తాయి… అంటే సగటున ప్రతి నెలా సుమారు 6.9 లక్ష రూపాయలు!
ఒక్క రోజు కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు, కెమెరా ముందు నటించాల్సిన అవసరం లేదు, ఎడిటర్‌తో గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ, బ్యాంక్ నుంచి వచ్చే SMSలు చూస్తూ ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టేయడమే. ఇంత పెద్ద ప్రాపర్టీ ఎలా వచ్చింది? ఎంత డబ్బు పెట్టుబడి పెట్టింది? ఎప్పటి నుంచి ఈ రెంట్ వస్తోంది? అసలు ఆమె ఎవరు?

Kajol1
ఆ స్మార్ట్ ఇన్వెస్టర్ ఎవరో కాదు మన బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ కాజోల్! ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’తో దేశమంతా అభిమానులను సంపాదించుకున్న ఈ భామ ఒకప్పుడు షారుఖ్‌కి బెస్ట్ జోడిగా చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు ఏ పని చేయకుండా స్మార్ట్‌గా నెలకు లక్షల్లో సంపాదిస్తూ ప్రాపర్టీ క్వీన్‌గా మారింది. ప్రస్తుతం కాజోల్ దేవ్‌గన్ ఇప్పుడు సినిమాల కంటే రియల్ ఎస్టేట్ నుంచే ఎక్కువ సంపాదిస్తున్నారు.
ఆమె పేరుతో ముంబయిలో ఇంకా ఎన్నో ప్రాపర్టీలు ఉన్నాయని, వాటి నుంచి కూడా కోట్లలో రెంట్ వస్తుందని అంచనా. అందుకే ‘స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దాన్ హార్డ్ వర్క్’ అంటారు కదా.. దాన్నే పాటిస్తూ నటిగానే కాకుండా స్మార్ట్ ఇన్వెస్టర్‌గానూ రాణిస్తోంది కాజోల్. ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసి సంపాదించిన డబ్బును ఇప్పుడు స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టి… జీవితాంతం ఆర్థిక భద్రతను సాధించుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ!
