Kaali Poster Row: వివాదానికి మరింత అగ్గి.. శివ పార్వతుల వేషధారుల ఫోటో పోస్ట్ చేసిన లీనా మణిమేకలై
తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో వివాదానికి తెరలేపింది కెనడాకు చెందిన భారతీయ సినీ నిర్మాత లీనా మణిమేకలై. ఈ సారి సిగరెట్ తాగుతున్న శివ పార్వతుల వేషధారుల్లో ఉన్న వ్యక్తుల ఫొటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Kaali Poster Row: కెనడాకు చెందిన భారతీయ సినీ నిర్మాత లీనా మణిమేకలై కాళీ డాక్యుమెంటరీ .. ప్రమోషనల్ పోస్టర్‌లో కాళీ దేవిని అభ్యంతరకరంగా చిత్రీకరించి.. ఆ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ లీనా ఎక్కడ తగ్గడం లేదు.. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో వివాదానికి తెరలేపింది. ఈ సారి సిగరెట్ తాగుతున్న శివ పార్వతుల వేషధారుల్లో ఉన్న వ్యక్తుల ఫొటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ ఫోటోకి ఇది ఎక్కడో అంటూ ట్వీట్ కూడా జత చేసింది.
తమిళనాడులోని మధురై లో జన్మించిన చిత్రనిర్మాత డైరెక్టర్ లీనా మణి మేకలై ఇప్పటికే కాళి డాక్యుమెంటరీ పోస్టర్ తో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో.. తనను తాను రక్షించుకునేందుకు తీసుకున్న చర్యగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే లీనా మణి మేకలై తీసిన కాళి డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అనేక చోట్ల లీనా పై కేసులు నమోదయ్యాయి. వివాదాస్పద పోస్టర్‌ను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ లీనా ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో వివాదం మరింత ముదురుతోంది.
Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
మణిమేకలై.. తాను జీవించి ఉన్నంత వరకు నిర్భయంగా తన వాయిస్‌ని వినిపిస్తానని అంటున్నారు. ‘అరెస్ట్ లీనా మణిమేకలై’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న పోస్టర్ సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది. చిత్రనిర్మాత మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ.. ఆరోపణలు చేస్తూ.. ఇప్పటికే పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ “చట్టపరమైన డిమాండ్”కి ప్రతిస్పందనగా ప్రస్తుతం వివాదానికి కేంద్రంగా ఉన్న తన డాక్యుమెంటరీ “కాళి” గురించి తాను చేసిన ట్విట్ ను డిలీట్ చేసింది. అంతేకాదు తాను కోల్పోయేది ఏమీ లేదు.. తాను జీవించి ఉన్నంత వరకు తాను నమ్మినదాన్ని నిర్భయంగా మాట్లాడతానని.. పేర్కొంది. అందుకు మూల్యం తన ప్రాణమైతే.. తాను దానిని కూడా లెక్కచేయనంటూ లీనా తమిళంలో ట్వీట్ చేసింది. వివాదంపై ఒక కథనానికి ప్రతిస్పందనగా.. పోస్టర్ వెనుక ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి డాక్యుమెంటరీని చూడాలని లీనా ప్రజలను కోరుతుంది..