Jennifer Lawrence Injured: షూటింగ్‌లో గాయపడిన హాలీవుడ్ అందాల భామ.. యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం..
Jennifer Lawrence Injured: హాలీవుడ్ అందాల భామ జెన్నీఫర్ లారెన్స్ ఓ చిత్ర షూటింగ్‌లో ప్రమాదానికి గురైంది. ఆస్కార్ అవార్డు పొందిన ఈ నటి ప్రస్తుతం నెట్
Jennifer Lawrence Injured: హాలీవుడ్ అందాల భామ జెన్నీఫర్ లారెన్స్ ఓ చిత్ర షూటింగ్‌లో ప్రమాదానికి గురైంది. ఆస్కార్ అవార్డు పొందిన ఈ నటి ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం డోంట్ లుక్ అప్ సెట్ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో కిటికీ అద్దం వచ్చి జెన్నీఫర్ కంటికి బలంగా తాకింది. దీంతో పెద్ద గాయం అయింది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం జెన్నీఫర్‌కు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం జెన్నీఫర్ క్షేమంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆడమ్ మెక్కే దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్రోక్టన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మెరీల్ స్ట్రీప్, తిమోతీ చాలమెట్, అరియానా గ్రాండే, లియోనార్డో డికాప్రియో, కేట్ బ్లాంచెట్, జోనా హిల్, హిమేష్ పటేల్, కిడ్ కడి, మాథ్యూ పెర్రీ మరియు టోమర్ సిస్లీ నటిస్తున్నారు.