నెట్ ఫ్లిక్స్‌లో మీ పిల్లలు ఏం చూస్తున్నారో ఇలా తెలుసుకోండి.. సరికొత్త టూల్ తీసుకొచ్చిన నెట్‌ ఫ్లిక్స్.

ఓటీటీ సంస్థలు చిన్న పిల్లలను ఆక‌ట్టుకునే కంటెంట్‌ను రూపొందిస్తుండ‌డంతో.. చిన్నారులు కూడా ఓటీటీలకు ఆక‌ర్షితుల‌వుతున్నారు. దీంతో చిన్నారులు అస‌లు ఎలాంటి కంటెంట్ చూస్తున్నార‌న్న సందేహాలు త‌ల్లిదండ్రుల్లో త‌లెత్తుతున్నాయి

నెట్ ఫ్లిక్స్‌లో మీ పిల్లలు ఏం చూస్తున్నారో ఇలా తెలుసుకోండి.. సరికొత్త టూల్ తీసుకొచ్చిన నెట్‌ ఫ్లిక్స్.
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 16, 2020 | 4:20 PM

Netflix Kids Activity Report Tool: ఇటీవ‌ల ఓటీటీల‌ హవా కొన‌సాగుతోంది. బ‌డా బ‌డా మీడియా సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టడంతో డిజిట‌ల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల‌కు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే ఓటీటీ సంస్థలు చిన్న పిల్లలను ఆక‌ట్టుకునే కంటెంట్‌ను రూపొందిస్తుండ‌డంతో.. చిన్నారులు కూడా ఓటీటీలకు ఆక‌ర్షితుల‌వుతున్నారు. దీంతో చిన్నారులు అస‌లు ఎలాంటి కంటెంట్ చూస్తున్నార‌న్న సందేహాలు త‌ల్లిదండ్రుల్లో త‌లెత్తుతున్నాయి. తమ పిల్లలు తెలియకుండానే అసభ్యకరమైన, హింసాపూరిత కంటెంట్‌ను చూస్తున్నారేమో అని కొందరు భావిస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ స‌రికొత్త టూల్‌ను తీసుకొచ్చింది. చిన్నారులు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారో త‌ల్లిదండ్రులు తెలుసుకునేలా ఈ టూల్‌ని రూపొందించారు. కరోనా సమయంలో చిన్నారులు ఇంటికే పరిమితం కావడం, ఇంటర్‌నెట్ వినియోగం పెరిగిపోవడంతో ఈ కొత్త టూల్‌ను తీసుకొచ్చినట్లు నెట్‌ ఫ్లిక్స్ ప్రకటించింది.

ఈ టూల్ సహాయంతో పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారన్న విషయాలపై ఓ క‌న్నెసి ఉంచొచ్చు. కిడ్స్ యాక్టివిట్ రిపోర్ట్ (Kids Activity Report) పేరుతో తీసుకొచ్చిన ఈ టూల్ పిల్లలు ఎక్కువ స‌మ‌యం ఎలాంటి కంటెంట్ చూస్తున్నార‌న్న దానిపై త‌ల్లిదండ్రుల‌కు ఒక రిపోర్ట్ రూపంలో అందిస్తుంది. చిన్నారులు ఎలాంటి షోల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు.? వారికి ఎలాంటి కొత్త షోలు రిక‌మండేష‌న్స్ వ‌స్తున్నాయి వంటివి తెలుసుకోవ‌చ్చు. ఈ కొత్త టూల్‌తో చిన్నారుల నెట్ ఫ్లిక్స్ అకౌంట్ యాక్సస్ క‌లిగి ఉన్న పేరెంట్స్ అందరికీ నెట్ ఫ్లిక్స్ కంపెనీ వారాంతంలో ఈ మెయిల్స్ రూపంలో స‌మాచారాన్ని అందిస్తుంది. అంతేకాదు త‌మ పిల్లలు ఎలాంటి కంటెంట్ చూడ‌కూడ‌ద‌ని పేరెంట్స్ భావిస్తారో అలాంటి వాటిని పాస్ట్‌వర్డ్ స‌హాయంతో చిన్నారుల‌కు క‌నిపించ‌కుండా చేయొచ్చు. ఇక ఇదిలా ఉంటే నెట్‌ ఫ్లిక్స్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ‘ఫ్యామిలీ ప్రొఫైల్’ పేరుతో తీసుకురానున్న ఈ ఫీచర్‌ పనితీరును ప‌రిశీలించ‌డానికి గ్లోబల్ టెస్ట్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా టీవీ షోల నుంచి సినిమాల వరకు అన్నింటిని ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఒకే ప్రొఫైల్‌లో చూడొచ్చు.