Prabhas Radheshyam: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ దశాబ్దానికి అతిపెద్ద ప్రేమ ప్రకటన వచ్చేసింది
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం 'రాధేశ్యామ్' గ్లింప్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.
Prabhas Radheshyam: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ గ్లింప్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా టీజర్‌కు ముహూర్తం ఖరారైంది. కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఫిబ్రవరి 14వ తేదీన రాధేశ్యామ్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ‘సేవ్ ది డేట్, ఈ దశాబ్దానికి గాను అతిపెద్ద ప్రేమ ప్రకటన’ అని మూవీ యూనిట్ పేర్కొంది. ప్రేమికుల రోజు అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ప్రభాస్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభాస్ 20వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రి టీజర్ కూడా దుమ్మురేపుతోంది. 1960 దశకం నాటి వింటేజ్ లవ్ స్టోరీతో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
Get ready for the biggest love announcement of the decade! ✨♥️ 14th Feb, save the date! ? #RadheShyamPreTeaser ▶️ https://t.co/ALrESp2z7v
Starring #Prabhas & @hegdepooja Directed by @director_radhaa Presented by @UVKrishnamRaju garu pic.twitter.com/TGyV5JVXLD
— UV Creations (@UV_Creations) February 6, 2021
గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, భాగ్య శ్రీ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీ రోల్స్ పోషిస్తున్నారు.
Also Read: