KGF-2 Overseas Rights : కేజీఎఫ్ చాప్టర్-2 ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా?..
KGF-2 Overseas Rights: కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా విడుదలైన
KGF-2 Overseas Rights: కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్నిభాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్ 1 కు మించిన యాక్షన్ సీన్స్ తో పార్ట్ 2ను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనాటాండన్ నటిస్తున్నారు. విలన్ అధీర పాత్రలో సంజయ్ కనిపించనున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా మరో రికార్డును కూడా నమోదుచేయనుంది. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి ఈ సినిమా బిజినెస్ దడ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీనితో ఈ చిత్రానికి ఏ స్థాయి క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఇంత మొత్తంలో కనుక కొంటే ఇది ఒక సరికొత్త రికార్డే అని చెప్పాలి. మరి ఈ కళ్ళు చెదిరే ఫిగర్ ను నిజంగానే డిమాండ్ చేసారా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
విశాల్ కోసం విలన్ గా మారిన హీరో.. ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న మల్టీస్టారర్ మూవీ